శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 26 జులై 2014 (14:48 IST)

క్రికెట్ రచ్చ: భర్తకు సపోర్ట్.. టినో మూర్ఖుడు, తన్నాల్సిందన్న సానియా!

తెలంగాణ అంబాసిడర్‌గా సానియా మీర్జాను నియమించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన తరుణంలో.. తన సంగతిని పక్కన బెట్టిన సానియా.. భర్తకు సపోర్ట్ చేసింది. వెస్టిండీస్ దీవుల్లో జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) సందర్భంగా విండీస్ బౌలర్ టినో బెస్ట్, పాకిస్థాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. 
 
ఓ దశలో ఇద్దరూ కలబడే పరిస్థితి తలెత్తింది. వెంటనే ఇతర ఆటగాళ్ళు, అంపైర్లు జోక్యం చేసుకుని వారిద్దరికీ సర్దిచెప్పారు. అటుపై హోటల్ వద్ద వీరిద్దరూ గొడవపడ్డారట. దీంతో, షోయబ్ మాలిక్ మ్యాచ్ ఫీజులో 60 శాతం కోతపెట్టారు.
 
దీనిపై, షోయబ్ మాలిక్ అర్ధాంగి, భారత టెన్నిస్ తార సానియా మీర్జా ఘాటుగా స్పందించారు. టినోను ఓ మూర్ఖుడిగా అభివర్ణిస్తూ, అతడిని షోయబ్ తన్నాల్సిందని ట్వీట్ చేసింది. సానియా ట్వీట్ పై ప్రతికూల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆమె అలా ట్వీట్ చేయడం సరికాదని క్రీడా వర్గాలంటున్నాయి.