శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 15 అక్టోబరు 2014 (14:05 IST)

పాక్ కెప్టెన్సీపై అఫ్రిది వెనక్కి తగ్గాడు.. మిస్బాకు ఓటేశాడు!

పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్సీపై ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది వెనక్కి తగ్గి.. మిస్బా ఉల్ హక్‌కే ఓటేశాడు. మిస్బా ఉల్ హక్ కెప్టెన్సీలో ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని , తన సహయ సహకారాలు అతనికి పూర్తిగా ఉంటాయని షాహిద్ అఫ్రిదీ తెలిపాడు.
 
న్యూజిలాండ్, ఆస్టేలియా సంయుక్తంగా 2015లో నిర్వహిస్తున్న ప్రపంచ కప్‌లో మిస్బా ఉల్ హక్ బెస్ట్ ఛాయస్ అని షాహిద్ అఫ్రిది పేర్కొన్నాడు. ప్రపంచ కప్‌కు మిస్బా ఉల్ హక్ కెప్టెన్‌గా ఉంటారని ఇందులో ఏ మార్పు లేదని పాకిస్దాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ షహర్యాన్ ఖాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
కాగా వరల్డ్ కప్ కోసం ప్రపంచ కప్‌లో జట్టు పగ్గాలు చేపట్టడానికి రెడీగా ఉన్నానని షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యానించాడు. అయితే బోర్డు సభ్యులు మిస్బా ఉల్ హక్ వైపే మొగ్గు చూపారు. దీంతో కెప్టెన్సీ రేసులో తాను లేనంటూ.. మిస్బాకు మద్దతిస్తున్నానని అఫ్రిది ఈ వివాదానికి తెరదించాడు.