శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 13 అక్టోబరు 2014 (12:19 IST)

ధోనీ, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్‌కు బీసీసీఐ ప్రోత్సాహం మెండు!

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆ ఇద్దరికి మాత్రం అధిక ప్రోత్సాహం ఇస్తోంది. భారత క్రికెటర్లుగా ఎనలేని సేవ చేసిన ఆ ఇద్దరిని బీసీసీఐ విశేషంగా ప్రోత్సహిస్తోంది. ఆ ఇద్దరూ ఎవరో తెలుసా.. సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి.
 
వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నందుకే బీసీసీఐ వీళ్లిద్దరి ఏడాదికి రూ.4 కోట్లు చెల్లిస్తోంది.  కామెంట్రీయే కాకుండా గవాస్కర్ ఐపీఎల్ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, రవిశాస్త్రి టీమిండియా డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో, ఇద్దరికీ చెరో రూ.2 కోట్లు బోనస్‌గా ప్రకటించింది.
 
ఇక, టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీకి ఫీజు రూపేణా గిట్టుబాటవుతోంది రూ.2.49 కోట్లు (35 మ్యాచ్‌లకు‌గాను). మ్యాచ్ ఫీజుల మొత్తం కంటే ఆరున్నర రెట్లు అధికంగా వాణిజ్య ఒప్పందాల ద్వారానే రాబడుతున్నాడట.