గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 17 నవంబరు 2014 (00:24 IST)

రాంచీ వన్డే: కెప్టెన్స్ కోహ్లీ, మాథ్యూస్ సేమ్ 139 రన్స్!

భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన రాంచీ వన్డేల్లో ఇరు జట్ల కెప్టెన్లు విరాట్ కోహ్లి, ఎంజెలో మాథ్యూస్ సేమ్ స్కోర్లు సాధించారు. అంతేకాకుండా ఇద్దరూ నాటౌట్‌గా నిలిచారు. మాథ్యూస్ 139, కోహ్లి 139 పరుగులు చేశారు.
 
ముందుగా బ్యాటింగ్ చేసిన నిర్ణీత శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. కెప్టెన్ మాథ్యూస్ అద్భుతంగా రాణించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ దిగిన మాథ్యూస్ సిక్సర్లతో విజృంభించాడు. ఫలితంగా 116 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సర్లతో 139 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
 
తదనంతరం బ్యాటింగ్ దిగిన కోహ్లి కూడా సరిగ్గా 139 పరుగులు మాత్రమే సాధించి అజేయంగా నిలిచాడు. కోహ్లి 126 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 139 పరుగులు సాధించాడు. మ్యాన్ ఆఫ్ మ్యాచ్‌గా మాథ్యూస్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును కోహ్లి సొంతం చేసుకోవడం విశేషం.