గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2014 (12:03 IST)

అవును.. అనుష్క శర్మను ప్రేమిస్తున్నా.. మీకేంటి కష్టం: కోహ్లీ

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో ప్రేమాయణం నిజమేనని క్రికెటర్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ మధ్య లవ్ ఎఫైర్ ఉన్న విషయం ప్రపంచమంతా తెలిసిందే. వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో చెట్టాపట్టాలు వేసుకుని పబ్బులు, క్లబ్బులు, విదేశాలకు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. 
 
అయితే వీరిద్దరి ప్రేమాయణంపై మీడియా ఓవరాక్షన్ చేయడంతో విసిగిపోయిన కోహ్లీ.. ఈ విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. ‘‘నేను అనుష్క శర్మని ప్రేమిస్తున్నాను. ఈ విషయం అందరికీ తెలిసిందే. దీన్ని మేమేం దాచడం లేదు. అందుకే నన్ను మాటమాటకీ ఈ విషయం గురించి ప్రశ్నించేవాళ్ళు కాస్తంత ఇంకితజ్ఞానంతో ఆలోచించి ఈ విషయంలో నన్ను మరోసారి ప్రశ్నించకండి’’ అని చెప్పాడు.