మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 28 జనవరి 2015 (19:00 IST)

బీసీసీఐని ప్రాధేయపడిన విండీస్: కోర్టుకీడ్చొద్దని..!

బీసీసీఐని వెస్టిండీస్ బోర్డు ప్రాధేయపడింది. గత ఏడాది భారత టూర్ మధ్యలోనే విండీస్ జట్టు స్వదేశానికి తిరుగుముఖం పట్టడం వివాదానికి దారితీసింది. నష్టపరిహారం చెల్లించాల్సిందేనని, లేని పక్షంలో, న్యాయపరమైన చర్యలు తప్పవంటూ బీసీసీఐ హెచ్చరించింది. దీంతో, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) బీసీసీఐని ప్రాధేయపడుతోంది. తమను కోర్టుకీడ్చవద్దంటూ వేడుకుంటోంది. 
 
విండీస్ బోర్డు అధ్యక్షుడు డేవ్ కామెరాన్ మాట్లాడుతూ, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని బీసీసీఐకి సూచించారు. తాము ఇంతకుముందు రాసిన లేఖలను, అందులో పేర్కొన్న ప్రతిపాదనలను సరిగా పరిశీలించలేదని ఆయన వాపోయారు. దీనిపై బీసీసీఐ స్పందించాల్సి ఉంది.