గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By CVR
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (14:15 IST)

కోర్టుకీడ్చొద్దు... వెస్టిండీస్ వేడుకోలు...!

భారత టూర్ నుంచి వెస్టిండీస్ జట్టు అర్థాంతరంగా స్వదేశానికి వెళ్లిపోవడం వివాదానికి దారితీసింది. నష్టపరిహారం చెల్లించాల్సిందేనని, లేని పక్షంలో, న్యాయపరమైన చర్యలు తప్పవంటూ వెస్టిండీస్ క్రికెట్ బోర్డును భారత బోర్డు (బీసీసీఐ) హెచ్చరించింది. విండీస్ జట్టు తప్పుకున్నందుకు 41.97 మిలియన్ డాలర్లు చెల్లించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది.
 
దీంతో తమను కోర్టుకీడ్చవద్దంటూ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) బీసీసీఐని వేడుకుంటోంది. ఈ సందర్భంగా విండీస్ బోర్డు అధ్యక్షుడు డేవ్ కామెరాన్ మాట్లాడుతూ సమస్య పరిష్కారం కోసం తమకు రెండు నెలలు సమయం ఇవ్వాలని కోరారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని తెలిపారు. తాము ఇంతకుముందు రాసిన లేఖలను, అందులో పేర్కొన్న ప్రతిపాదనలను బీసీసీఐ సరిగా పరిశీలించలేదని ఈ సందర్భంగా డేవ్ కామెరాన్ వాపోయారు.