గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 26 ఆగస్టు 2014 (10:53 IST)

యువీ తండ్రి యోగరాజ్ అరెస్ట్: గొడవకు దిగాడని..

భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్‌ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. చంఢీఘడ్ సమీపంలోని పంచకులలో గొడవకు దిగడంతో యోగరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 
 
యోగరాజ్‌తో పాటు మరో వ్యక్తిని కూడా ఈ సంఘటనలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం పంచకులలోని సెక్టర్‌2లో ఆదివారం ఓ పార్టీకి హాజరైన యోగరాజ్ సింగ్, కారు పార్కింగ్ వద్ద జరిగిన గొడవలో ఓ వ్యక్తిపై దాడి చేసినట్లు ఫిర్యాదు అందడంతో అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.