మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Modified: హైదరాాబాద్ , శుక్రవారం, 3 మార్చి 2017 (04:23 IST)

ఇలాగే క్యాచ్‌లు వదిలేస్తే భారత్ గెలవడం కల్లే: క్లార్క్ ఎద్దేవా!

ఈసారైనా క్యాచ్‌లు గట్టిగా పట్టుకోండి లేకపోతే స్మిత్ మళ్లీ సెంచురీ చేయడమే కాకుండా మీ దుంప తెంచుతాడు అంటూ క్లార్క్ హితవు పలికాడు.

తొలి టెస్టులో లాగే స్మిత్ ఇచ్చిన క్యాచ్‌లను రెండు మూడు సార్లు వదిలేస్తే భారత్ ఇక ఇంటికిపోవలసిందేనని ఆసీస్ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ భారత క్రికెట్ జట్టును హెచ్చరించాడు. పుణేలో జరిగిన తొలి టెస్టులో భారత్ చెత్త ఫీల్డింగ్ కారణంగా మూడు సార్లు జీవనదానం పొందిన ఆసీస్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ తర్వాత విరుచుకుపడి సెంచురీ చేయడమే కాకుండా ఆటను భారత్‌నుంచి అమాంతంగా లాగేసుకున్న విషయం తెలిసిందే. 
 
ఈసారైనా క్యాచ్‌లు గట్టిగా పట్టుకోండి లేకపోతే స్మిత్ మళ్లీ సెంచురీ చేయడమే కాకుండా మీ దుంప తెంచుతాడు అంటూ క్లార్క్ హితవు పలికాడు. ఆసీస్ జట్టులో నలుగురు బడా ఆటగాళ్లను భారత్ ఎదుర్కొవల్సి ఉంటుందని క్లార్క్ హెచ్చరించాడు. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, మిషెల్ స్టార్క్, జోష్ హజిల్ వుడ్. ఈ నలుగురినీ బీట్ చేయాలంటే భారత్ తన అత్యుత్తమ ఆటను ప్రదర్సించాల్సిందే అని సూచించాడు.
 
ఆస్ట్రేలియాపై తొలి టెస్ట్‌‌లో కోహ్లీసేన భారీ తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో గనక భారత్ టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసి ఉంటే మాత్రం ఆసిస్ గెలిచేదని తాను అనుకోవడం లేదని చెప్పాడు. బెంగళూరు టెస్ట్‌లో కూడా టాస్ కీలకం కానుందని, ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఎక్కువ పరుగులు చేయగలిగిన వారికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పాడు.