మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 10 జూన్ 2017 (05:57 IST)

ప్రతి గేమూ గెలుస్తామని ఏమైనా రాసిచ్చామా? ఓటమిని అంగీకరించాల్సిందే అన్న కోహ్లీ

వన్డే క్రికెట్‌లో వరుస విజయాలతో ఊగిపోతున్న టీమిండియాకు శ్రీలంక జట్టు అద్భుత బ్యాటింగుతో గుణపాటం నేర్పింది. కానీ టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ అందుకు ఏమాత్రం బాధపడుతున్నట్లుగా లేడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో రాణించినా శ్రీలంక బ్యాట్స్‌మెన

వన్డే క్రికెట్‌లో వరుస విజయాలతో ఊగిపోతున్న టీమిండియాకు శ్రీలంక జట్టు అద్భుత బ్యాటింగుతో గుణపాటం నేర్పింది. కానీ టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ అందుకు ఏమాత్రం బాధపడుతున్నట్లుగా లేడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో రాణించినా శ్రీలంక బ్యాట్స్‌మెన్ అద్భుత ఆటతీరు కారణంగానే తాము ఓడిపోయామని, ప్రత్యర్థి ప్రదర్శనను కూడా ఒక్కోసారి మనం గుర్తించాల్సి ఉంటుందని కోహ్లీ సమర్థించుకున్నాడు. అయితే ఏ జట్టూ అజేయంగా కొనసాగలేదని, పరాజయాలు ప్రతి జట్టుకూ సహజమేనని కోహ్లీ తత్వంలోకి వెళ్లిపోయాడు.
 
ఇటీవలి కాలంలో అన్ని ఫార్మాట్‌లలో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టుకు శ్రీలంక షాక్‌ ఇచ్చింది. అయితే 8 పటిష్ట జట్లు తలపడుతున్న టోర్నీలో ఇలాంటి ఓటమి సహజమేనని భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిప్రాయ పడ్డాడు. ‘మేం చేసిన స్కోరు విజయానికి సరిపోతుందని అనిపించింది. నిజానికి మా బౌలర్లు కూడా బాగానే బౌలింగ్‌ చేశారు. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ చాలా బాగా ఆడారనే విషయం మరచిపోవద్దు. వారి ప్రదర్శనను కూడా గుర్తించాలి కదా. అయినా మేమేమీ అజేయులం కాదు. మాకూ పరాజయాలు ఎదురు కావచ్చు’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. 
 
తగిన వ్యూహంతో లంక ఆడిన తీరును అభినందిస్తూ ఓటమిని అంగీకరించడం తప్ప మరేమీ చేయలేమని కోహ్లి అన్నాడు. భారత బౌలర్ల ప్రదర్శనను బట్టి చూస్తే దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో అదనంగా మరో 20 పరుగులైనా చేయాల్సి ఉంటుందని విరాట్‌ విశ్లేషించాడు. మధ్య ఓవర్లలో కూడా విధ్వంసకర బ్యాటింగ్‌ చేయడం భారత్‌కు మొదటినుంచి అలవాటు లేదని ఈ సందర్భంగా కోహ్లి గుర్తు చేశాడు.‘50 ఓవర్ల పాటు దూకుడుగా ఆడే జట్టు కాదు మాది. ఆరంభంలో నెమ్మదిగా ఆడి నిలదొక్కుకున్న తర్వాత చివర్లో చెలరేగిపోవడమే మా శైలి’ అని కెప్టెన్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.