గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: శనివారం, 25 జూన్ 2016 (14:39 IST)

5 వరల్డ్ బ్యూటీ క్వీన్స్... అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటనలు...

వాళ్లంతా ప్రపంచంలో అందగత్తె కిరీటాలను ధరించిన అత్యంత అందగత్తెలు. కానీ వారిలో కొంతమంది అందగత్తెలు అత్యంత దారుణంగా హత్య చేయబడ్డారు. ఆ హత్యలు కొన్ని మిస్టరీగానే మిగిలిపోయాయి. 2005లో మిస్ యూనివర్స్ పోటీలో నిలిచిన మిస్ వెనిజులా మోనికా స్పియర్ ఐదో మిస్ యూన

వాళ్లంతా ప్రపంచంలో అందగత్తె కిరీటాలను ధరించిన అత్యంత అందగత్తెలు. కానీ వారిలో కొంతమంది అందగత్తెలు అత్యంత దారుణంగా హత్య చేయబడ్డారు. ఆ హత్యలు కొన్ని మిస్టరీగానే మిగిలిపోయాయి. 2005లో మిస్ యూనివర్స్ పోటీలో నిలిచిన మిస్ వెనిజులా మోనికా స్పియర్ ఐదో మిస్ యూనివర్స్ అందగత్తెగా నిలిచింది. ఐతే ఆమె తన భర్త, కుమార్తెతో కలిసి షికారుకి వెళ్లి వస్తుండగా కొందరు దొంగలు డబ్బును దోచుకునేందుకు ఆమెపై కాల్పులు జరిపారు. దాంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందగా ఆమె కుమార్తె కాలుకి తీవ్ర గాయమైంది.
 
మిస్ హోండురాస్ మరియా జోస్‌ను చంపి పూడ్చిపెట్టారు
19 ఏళ్ల మిస్ హోండురాస్ మరియా జోస్ ఆమె సోదరిని కొందరు దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. సోదరిలు ఇద్దరూ ఓ పార్టీకి హాజరైన సందర్భంలో అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ... ఆ రాత్రి వాళ్లిద్దరూ ఇంటికి తిరిగిరాలేదు. పోలీసులు దర్యాప్తులో వారిద్దరినీ హత్య చేసి నగరానికి దూరంగా ఉన్న శ్మశానంలో పాతిపెట్టి ఉంచినట్లు కనుగొన్నారు. ఆ కేసు ఇప్పటికీ మిస్టరిగానే మిగిలిపోయింది.
 
 
బోయ్ ఫ్రెండ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో మిస్ రష్యా పెట్రోవా మృతి
19 ఏళ్ల మిస్ రష్యా అలెగ్జాండర్ పెట్రోవా ఎంతో అందగత్తె. కానీ ఆమెను మృత్యువు బోయ్ ఫ్రైండ్ పైన జరిగిన దాడి రూపంలో కబళించింది. మాఫియాతో సంబంధాలు కలిగి ఉన్న ఆమె ప్రియుడుపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ సమయంలో అతడి పక్కనే అలెగ్జాండ్ర కూడా ఉండటంతో ఆమె కూడా మృత్యువాత పడింది.
 
 
మిస్ హాలీవుడ్ మర్డర్... పెద్ద మిస్టరీ
మిస్ హాలీవుడ్ జిల్ ఆన్ హత్య పెద్ద మిస్టరీగా మిగిలింది. ఆమెను 1998లో క్యాలిఫోర్నియాలోని ఫ్రెస్నోలో అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఐతే ఆ హత్యకు పలు కోణాలు కూడా ఉన్నట్లు చెపుతారు. ఆమె మాదక ద్రవ్యాలు, వ్యభిచారం కూపంలోకి ఇరుక్కుపోయిందనీ, ఈ రెండే ఆమె హత్యకు కారణమై ఉంటాయని పోలీసులు నిర్థారణకు వచ్చారు. కానీ ఆమె హత్య ఎందుకు జరిగిందన్న వాస్తవాన్ని కనుగొనలేకపోయారు.
 
క్రైం రేటు పెరిగిందని ఆందోళన చేస్తే కాల్చి చంపారు... మిస్ టూరిజం హత్య...
మిస్ టూరిజం జెనెసిస్ కార్మోనాది మరో విషాద గాధ. వెనుజులాలో నేరాల శాతం నానాటికీ పెరిగిపోతుందంటూ ఆమె ఆందోళన చేస్తున్న సమయంలో ఆమెపై కాల్పులు జరిగాయి. బుల్లెట్ ఆమె తల లోనుంచి దూసుకుపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.