Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి తెలుగువాడి దెబ్బ పడిందా? కాంగ్రెస్ పరాజయానికి 5 కారణాలు(Video)

మంగళవారం, 15 మే 2018 (12:05 IST)

Widgets Magazine

కాంగ్రెస్ పార్టీ దేశంలో క్రమంగా కనుమరుగైపోయే రోజులు వచ్చేసినట్లు కనబడుతున్నాయి. ఉత్తరాదిలో పూర్తిగా ఖాళీ అయిన కాంగ్రెస్ పార్టీ కాస్తోకూస్తో దక్షిణాది కర్నాటకలో పట్టు నిలుపుకుని వుండింది. ఐతే తాజాగా కర్నాటక ఎన్నికల్లోనూ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకింత ఘోరంగా ఓడిపోతోంది? గత పదేళ్లుగా దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటున్న దాఖలాలు కనిపించడంలేదు. కర్నాటకలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న యడ్యూరప్పకు అక్కడి ప్రజలు పట్టం కడుతున్నట్లు ప్రస్తుత ట్రెండింగును బట్టి అర్థమవుతుంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి ఎందుకింత ఘోర పరాజయం చవిచూడాల్సి వస్తుందో ఒక్కసారి చూస్తే కొన్ని పాయింట్లయితే కనబడుతున్నాయి.
Rahul Gandhi-Modi
 
1. ఇది ముఖ్యంగా ఏపీకి సంబంధించినదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు దేశాన్ని నివ్వెరపరిచింది. పార్లమెంటు తలుపులు వేసి మరీ రాష్ట్ర విభజన చేసేసింది. పైగా ఆ విభజన కూడా సరైన తీరులో లేకపోవడంతో తెలుగువారి మనస్సుల్లో గాయంగా మిగిలింది. ఆ మాటకొస్తే దేశ ప్రజల్లో చాలామంది దానిని ఆక్షేపించారు. ఇక అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ పతన ప్రారంభమైందని చెప్పవచ్చు.
 
2. ఇంకో విషయం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచారం చాలా చప్పగా సాగింది. వ్యూహాత్మక అడుగులు వేయడంలోనూ, పార్టీని సరైన దిశలో నడిపించడంలోనూ విఫలమవుతున్నారనే అపవాదు ఉండనే వుంది. పార్టీ పటిష్టపరిచేందుకు రాహుల్ గాంధీ తీసుకుంటున్న చర్యలు పెద్దగా ఫలించడంలేదన్న వాదన లేకపోలేదు. ఈ కారణాలు కర్నాటక ఎన్నికలపై చూపించాయని అంటున్నారు.
 
3. కర్నాటకలో సిద్ధరామయ్య సర్కారు అభివృద్ధి కార్యక్రమాలలో వెనకబడిపోయిందన్న వాదన కూడా వుంది. యడ్యూరప్ప అవినీతిని సిద్ధరామయ్య సర్కారు అవినీతి అధిగమించిందన్న ఆరోపణలు సైతం వున్నాయి.
 
4. కులం సమీకరణాలు. యడ్యూరప్ప సామాజికవర్గం అంతా మరోసారి యడ్డి వెనుక వెన్నుదన్నుగా నిలవడం వల్ల కూడా భాజపా గెలుపు సుళువైందన్న వాదనలు వస్తున్నాయి. గతంలో భాజపా నుంచి దూరమైన యడ్యూరప్పను తిరిగి పార్టీలో చేర్చుకుని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తెలివిగా ఎన్నికల్లో నెగ్గుకొచ్చారని చెపుతున్నారు.
 
5. కాంగ్రెస్ పార్టీ కంటే భాజపా బెస్ట్ అనే విశ్వాసం ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో భాజపా నాయకులు పూర్తిగా విజయవంతమయ్యారు. ఎన్నికల వేళ శ్రీరాములుకి సంబంధించి వీడియో బయటకు వచ్చినా ప్రజలు మాత్రం భాజపా వెంట నడిచినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తమ్మీద దక్షిణాదిలో వున్న పెద్ద రాష్ట్రం కర్నాటకను కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. వీడియోలో చూడండి విశ్లేషణ...Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

#KarnatakaVerdict : కన్నడనాట కాషాయ వికాసానికి కారణాలేంటి?

వచ్చే యేడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఈ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా కర్ణాటక ...

news

#KarnatakaElectionResults2018 : సర్వే ఫలితాలన్నీ తలకిందులయ్యాయి..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అన్ని ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు వెల్లడించిన సర్వే ...

news

#KarnatakaVerdict : ఓటమి దిశగా నటుడు సాయికుమార్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం దిశగా దూసుకెళుతోంది. అయితే, ఆ పార్టీ ...

news

కర్ణాటక ఎన్నికల ఫలితాలు : సింపుల్ మెజార్టీ దిశగా బీజేపీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ సింపుల్ మెజార్టీని సాధించనుంది. ...

Widgets Magazine