Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మన్నార్‌గుడి మాఫియాను తరిమి కొట్టండి... పోలీసులకు పన్నీర్ ఆర్డర్?, శశి వెంట 119 మంది ఎమ్మెల్యేలు...

సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (13:45 IST)

Widgets Magazine

తమిళనాడులో అత్యధిక ప్రజలు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వైపు వున్నారన్న వార్తలు, సర్వేలు వెలువడుతూ వుండటంతో ఆయనలో ధైర్యం పెరిగింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తొలుత ఆయన అమ్మ జయలలిత సమాధి వద్ద మౌనవ్రతం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారుతూ వచ్చాయి. శశికళ తను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు ఎంతగా ఆరాటపడినా రాష్ట్ర గవర్నర్ మాత్రం రాజకీయ పార్టీల్లో చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలిస్తూ న్యాయనిపుణుల అభిప్రాయాలను తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
 
గవర్నర్ నుంచి పిలుపు రాకపోవడంతో శశికళ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తనను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేవిధంగా గవర్నర్ ను ఆదేశించాలంటూ ఆమె పిటీషన్ దాఖలు చేశారు. మరోవైపు శశికళ వర్గం నుంచి పన్నీర్ క్యాంపుకు చేరుకునే ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. తాజాగా మూడు రోజుల పాటు శశికళ వర్గంలో ఉండి, ఆపై తప్పించుకు వచ్చిన ఎమ్మెల్యే ఒకరు, పన్నీర్ సెల్వం ఇంటికి వచ్చి ఆయన్ను కౌగిలించుకుని, ముద్దు పెట్టి ఏడ్చారు. 
 
తమను బలవంతంగా శశి క్యాంపుకు తీసుకెళ్లారని ఆరోపించారు. శశికళ శిబిరంలోని చాలామంది ఎమ్మెల్యేలకు అక్కడ ఉండటం ఇష్టం లేదని, తప్పించుకు వచ్చేందుకు మార్గాలను వెదుకుతున్నారని తెలిపారు. వారందరినీ బయటకు తెప్పించాలని కోరారు. కాగా, తనకే సీఎంగా అవకాశం లభిస్తుందన్న నమ్మకంతో ఉన్న పన్నీర్ సెల్వం, సోమవారం ఉదయం నుంచి తనను కలిసేందుకు వస్తున్న సీనియర్ నేతలు, సినీ నటులు, అభిమానులతో మాట్లాడుతూ బిజీగా గడుపుతున్నారు.
 
మరోవైపు గవర్నర్ ఇంకా నిర్ణయాన్ని ప్రకటించక పోవడాన్ని శశికళ వర్గం జీర్ణించుకోలేక పోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సోమవారం సాయంత్రం 4 గంటల వరకూ సమయం ఇచ్చిన శశికళ, ఆపై తన సత్తా చూపిస్తానని హెచ్చరించిన నేపథ్యంలో చెన్నై అంతటా హై అలర్ట్ ప్రకటించారు. కాగా సోమవారం ఉదయం సచివాలయం వెళ్లిన ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మన్నార్ గుడి మాఫియాను తరిమితరిమి కొట్టి వారి చెరలో మగ్గుతున్న ఎమ్మెల్యేలకు విముక్తి కల్పించాలని పోలీసులకు ఆదేశాలివ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి చివరికి ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
#secretariat #opanneerselvam #tamilnadu Secretariat #permanent Cm

Loading comments ...

తెలుగు వార్తలు

news

శశికళకే బలం.. పన్నీర్ సెల్వం-స్టాలిన్ భేటీ ఎందుకు..? ఓపీఎస్ సీఎం అవుతారా? లేదా?

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ద్వారా.. తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంకు ...

news

ఇమ్మిగ్రేషన్, గోడ నిర్మాణంపై వ్యతిరేకత.. మెక్సికో ఏకమైంది.. ట్రంప్ హిట్లర్ అంటూ..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై వ్యతిరేక స్వరాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ...

news

పన్నీర్‌ సెల్వంను వెనకుండి నడిపించేది.. బీజేపీ కానే కాదట.. ఆ ఏడుగురేనట?

తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం తెరలేపిన రాజకీయ సంక్షోభానికి అసలు కారణం బీజేపీ ...

news

అమ్మ చనిపోయాక ప్రమాణం చేశాను.. పన్నీరు పార్టీని నాశనం చేయాలని?: శశికళ

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే పార్టీని నాశనం చేయాలని ...

Widgets Magazine