గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By JSK
Last Modified: ఆదివారం, 26 జూన్ 2016 (13:19 IST)

అమ‌రావ‌తి నిర్మాణం సీఎం చంద్రబాబు కోడలికి సంబంధించిన కంపెనీకి కట్టబెడుతున్నారా...?

అమ‌రావ‌తి : న‌వ్యాంధ్ర రాజ‌ధాని నిర్మాణాన్ని స్విస్ ఛాలెంజ్ ప‌ద్ధ‌తిలో నిర్మాణానికి ఏపీ ప్ర‌భుత్వం సింగ‌పూర్ కంపెనీల‌తో కాంట్రాక్టులు ఖ‌రారు చేసేసింది. అయితే ఈ స్విస్ ఛాలెంగ‌జ్ విధానం వెనుక అస‌లు పెద్ద క‌థే ఉంద‌ని తెలుస్తోంది. ఏపీ రాజ‌ధాని నిర్మాణం ఇ

అమ‌రావ‌తి : న‌వ్యాంధ్ర రాజ‌ధాని నిర్మాణాన్ని స్విస్ ఛాలెంజ్ ప‌ద్ధ‌తిలో నిర్మాణానికి ఏపీ ప్ర‌భుత్వం సింగ‌పూర్ కంపెనీల‌తో కాంట్రాక్టులు ఖ‌రారు చేసేసింది. అయితే ఈ స్విస్ ఛాలెంగ‌జ్ విధానం వెనుక అస‌లు పెద్ద క‌థే ఉంద‌ని తెలుస్తోంది. ఏపీ రాజ‌ధాని నిర్మాణం ఇప్పుడు హాట్ టాపిక్. తాత్కాలిక రాజ‌ధాని కోస‌మే 200 కోట్లు కేటాయించి... ఇప్పుడు శాశ్వ‌త రాజ‌ధాని నిర్మాణం కూడా స్విస్ ఛాలెంజ్ ప‌ద్ధ‌తికి ప్ర‌భుత్వం ఒకే చెప్పేసింది. తాను అనుకున్న కంపెనీకి రాజ‌ధాని నిర్మాణం క‌ట్ట‌బెట్ట‌డానికి చంద్ర‌బాబు క్యాబినెట్ ఓకే అనేసింది. ఇక ఆ కంపెనీకి రాజ‌ధాని నిర్మాణం పేరిట ప్ర‌జ‌ల భూములు, ప్ర‌భుత్వ ఆస్తులు అప్ప‌గించ‌డ‌మే త‌రువాయి. అయితే ఈ వ్య‌వ‌హారంలో త‌మ‌కు చాలా ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని చీఫ్ సెక్ర‌ట‌రీ స‌హా అధికార యంత్రాంగం అంతా భావిస్తున్నట్లు సమాచారం.
 
అందుకే బాబు క్యాబినెట్ నిర్ణ‌యం తీసుకోవాలి త‌ప్ప‌.. తాము మాత్రం సంత‌కాలు చేసేది లేద‌ని తేల్చి చెప్పేసింది. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు వెన‌కుడుగు వేయ‌లేదు. నేరుగా రాజ‌ధాని నిర్మాణం వ్య‌వ‌హారం స్విస్ ఛాలెంజ్ ప‌ద్ధ‌తిలో సింగ‌పూర్ కంపెనీల‌కు అప్ప‌గించ‌డం ఖాయం అయ్యింది. అయితే సెంబ్ కార్ప్, అసెండాస్-సింగ్ బ్రిడ్జ్ అనే కంపెనీల‌కు ఆ వ్య‌వ‌హారం క‌ట్ట‌బెట్ట‌డం వెనుక చాలా పెద్ద క‌థే న‌డిచిన‌ట్టు ప‌లువురు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆ రెండు కంపెనీలు టెమాసెక్ హోల్డింగ్స్ అనే మ‌రో కంపెనీ చేతుల్లో ఉన్నాయి. 
 
అంతేకాదు వెర్టెక్స్ వెంచ‌ర్స్ అనే మ‌రో కంపెనీ కూడా భాగ‌స్వామిగా ఉంది. ఆకంపెనీలో గ‌తంలో చంద్ర‌బాబు కోడ‌లు, నారా లోకేష్ భార్య బ్రాహ్మ‌ణి ప‌నిచేసిన‌ట్టు ఆ కంపెనీ అధికారికంగా చెబుతోంది. అంతేగాకుండా కొద్దికాలం క్రిత‌మే ఈ టెమాసెక్ హోల్డింగ్స్ హైద‌రాబాదులో వ్యాపారాలు ప్రారంభించింది. కేర్ హాస్పిట‌ల్‌ను కొనుగోలు చేసింది. మ‌రో అస‌లు విష‌యం ఏమంటే ఇప్పుడు స్విస్ ఛాలెంజ్ ప‌ద్ధతిలో రాజ‌ధాని నిర్మాణం అప్ప‌గించ‌బోతున్న సంస్థ‌లో ఈ టెమాసెక్ హోల్డింగ్స్ గ‌త ఏడాది జూన్ నెలలో భాగ‌స్వామి కావ‌డం విశేషం.
 
మొత్తంగా ప‌క్కా స్కెచ్ ప్ర‌కారం చంద్ర‌బాబు స‌న్నిహితుల‌కు, కుటుంబ స‌భ్య‌ల‌కు సంబంధించిన కంపెనీల‌కు రాజ‌ధాని నిర్మాణం క‌ట్ట‌బెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త‌ద్వారా రాజ‌ధాని పేరిట సాగ‌బోతున్న వ్య‌వ‌హారమంతా చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లో ఇలాంటి క్విడ్ ప్రోకో వెనుక ఉన్న బినామీ కంపెనీల లాభాల కోసం సాగుతున్న చందాన క‌నిపిస్తోందని అంటున్నారు. అందుకే ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం పెద్ద క‌ల‌క‌లం రేపుతోంది. చంద్ర‌బాబు కుటుంబంతో సంబంధాలున్న వారికే ఇంత పెద్ద వ్య‌వ‌హారంలో బాగ‌స్వామ్యం ద‌క్క‌డం వెనుక పెద్ద క‌థే న‌డిచిన‌ట్టు అనుమానాలు పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే రాజ‌ధానిలో మంత్రులు, వారి బంధువుల భూమ‌లు బండారం బ‌య‌ట‌ప‌డింది, టీడీపీ ఎంపీలు, ఇత‌ర స‌న్నిహితులు కొనుగోలు చేసిన భూములు, అసైన్డ్ ల్యాండ్స్ పేరిట సాగిన వ్య‌వ‌హారం పెద్ద దుమారం రేపింది. ఇక ఇప్పుడు నేరుగా రాజ‌ధాని నిర్మాణం కాంట్రాక్ట్ ఏకంగా సీఎం కోడ‌లికి సంబంధించిన కంపెనీకే ద‌క్క‌డంపై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.