మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By tj
Last Updated : బుధవారం, 24 మే 2017 (13:58 IST)

తెలంగాణాలో బీజేపీ అధికారం సాధ్యమా...?

ప్రస్తుతం ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ చీఫ్‌ అమిత్ షా పర్యటనపైనే చర్చ. దక్షిణాది రాష్ట్రాల వైపు ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ మొదటగా తెలంగాణాపై పడింది. ఏకంగా బీజేపీ చీఫ్‌ అమిత్ షా రంగంలోకి దిగి పర

ప్రస్తుతం ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ చీఫ్‌ అమిత్ షా పర్యటనపైనే చర్చ. దక్షిణాది రాష్ట్రాల వైపు ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ మొదటగా తెలంగాణాపై పడింది. ఏకంగా బీజేపీ చీఫ్‌ అమిత్ షా రంగంలోకి దిగి పర్యటన కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ అధికారంలో వచ్చి తీరుతుందనేది అమిత్ షా ధీమా. తెరాస కుటుంబ పాలనపై బురదజల్లే ప్రయత్నం చేశారు అమిత్ షా. అయితే దీనిపై ఇప్పటివరకు తెరాస నేతలు గానీ, అటు కాంగ్రెస్ పార్టీ నేతలు గానీ స్పందించలేదు. 
 
కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం ఒకటే చెబుతున్నారు తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావడం కల్లేనంటున్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడి తెలంగాణా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణా జిల్లాల్లో అభివృద్ధి జరుగుతూనే ఉంది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా తెరాసకే పట్టం కడతారని. ఇక ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికే పరిమితం కావడం ఖాయమంటున్నారు. 
 
ఇప్పటివరకు తెలంగాణాలో పెద్దగా కార్యకర్తలు, నాయకులు‌లేని బీజేపీ గెలవడమేమిటంటున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉంది కనుక బీజేపీ తెలంగాణాలో అధికారాన్ని చేజిక్కించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు మరికొందరు. మరి ఇది ఎంతవరకు సాధ్యమో వేచి చూడాల్సిందే.