Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాబును భయపెడుతున్న అమిత్ షా, జగన్ మోహన్ రెడ్డి... పవన్ ఎర్ర జెండా...

శుక్రవారం, 12 మే 2017 (15:40 IST)

Widgets Magazine

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మెల్లగా కాకను పుట్టిస్తున్నాయి. ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉండగానే పొత్తులు, చర్చలు గట్రా జరిగిపోతున్నాయి. జనసేన పార్టీతో కలిసి నడిచేందుకు సిద్ధమని వామపక్షాలు ఇప్పటికే ఆ దిశగా ముందడుగు వేశాయి. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే వామపక్ష పార్టీలకు, తన భావజాలానికి చాలా దగ్గర సంబంధం వుందని చెప్పారు.
 
ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కూడా ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాస్తంత ముందుచూపుతో వెళుతున్నారు. ఈ నేపధ్యంలో ఇటీవల నేరుగా ప్రధానమంత్రితో ఆయన భేటీ అయినట్లు సమాచారం. ఈ భేటీలో రాష్ట్ర సమస్యలపై మాట్లాడినట్లు చెపుతున్నా... ఈ భేటీలోనే వైకాపా- భాజపా దోస్తికి పావులు కదిపినట్లు తెలుస్తోంది. 
 
ప్రధానిని జగన్ కలవడంపై తెదేపా నాయకులు తీవ్రస్థాయిలో మండిప్డారు. మోదీ వద్దకెళ్లి సాష్టాంగ ప్రమాణం చేసి కేసుల నుంచి తప్పించాలని వేడుకోలు చేసుకున్నారని తెదేపా నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీనిపై వైకాప నుంచి ఎంతమంది మాట్లాడారో తెలియదు కాని, భాజపా నాయకుడు విష్ణు కుమార్ రాజు మాత్రం తెదేపా నాయకులపై రివర్స్ ఎటాక్ చేశారు. ప్రధాని గురించి చులకనగా మాట్లాడవద్దనీ, ఐనా ప్రధానమంత్రిని జగన్ మోహన్ రెడ్డి కలిస్తే మీకేంటి అంత భయం అంటూ ప్రశ్నిస్తున్నారు వైకాపా మద్దతుదారులు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వీడియో పిచ్చి.. కళ్లముందు మనిషి కాలిపోతున్నా పట్టించుకోలేదు.. సజీవంగా?

సెల్ఫీలు, వీడియోల పిచ్చి ప్రస్తుతం బాగా ముదిరిపోతుంది. స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో మనుషుల్లో ...

news

13 యేళ్ళ బాలికపై పాస్టర్ అత్యాచారం... 40 యేళ్ళ జైలుశిక్ష

కేరళ రాష్ట్రంలోని త్రిశూర్‌లో 13 యేళ్ళ బాలిక అత్యాచారానికి గురైంది. ఈ అఘాయిత్యానికి ...

news

పాయల్ వెడ్డింగ్ రిసెప్షన్ డ్యాన్స్.. షారూఖ్ పాటకు వధువు చిందులు.. వీడియో వైరల్

పెళ్ళిళ్లలో వధూవరులు డ్యాన్స్ చేయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఇటీవల ఓ వధువు తన కుటుంబం, ...

news

కమ్యూనిస్టులతో పవన్ ప్రయాణం లాభాన్నిస్తుందా...!

సినీనటులు రాజకీయాల్లోకి రావడం కొత్తమే కాదు. దివంగత నేత నందమూరి తారకరామారావు నుంచి జూనియర్ ...

Widgets Magazine