శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2015 (15:21 IST)

పవన్ కల్యాణ్‌కు విద్యార్థి బహిరంగ లేఖ: మదర్ థెరిసాలా నటించొద్దు..రాజకీయాల్లో రాయేసి..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రవీణ్ కుమార్ అనే మెకానికల్ ఇంజినీర్‌ బహిరంగ లేఖ రాశాడు. ఆ లేఖలో పవన్ కల్యాణ్‌పై ఏమాత్రం జంకుగొంకు లేకుండా ప్రశ్నాస్త్రాలు సంధించాడు. ప్రశ్నలనే కాదు లెక్కలేనన్ని కౌంటర్లు కూడా ఇచ్చాడు. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే..? 
 
డియర్ మిస్టర్ పవన్ కల్యాణ్, 
నా పేరు ప్రవీణ్. తుళ్లూరుకు చెందినవాడిని. ఏపీ సీఎం రాజధాని నిర్మాణంలో తుళ్లూరు ఉందనే విషయం తెలిసిందే. ప్రస్తుతం నేను గ్రామానికి, తల్లిదండ్రులకు దూరంగా మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నా. మీ ట్వీట్లు, కామెంట్లు, ప్రసంగాల్ని ఫాలో అవుతుంటా. గత ఏడాదే మీకు బహిరంగ లేఖ రాయాలనుకున్నా. కానీ కుదరలేదు. ఇప్పుడు మిమ్మల్ని డైరక్ట్‌గా ఈ లేఖ ద్వారా ప్రశ్నిస్తున్నా. 
 
పవన్ గారూ.. మీరు చాలా రిచ్. చెన్నై నుంచి సినిమాల్లోకి ఎంటరయ్యారు. ఇందుకు మెగా బ్రదర్స్ స్టార్‌డమ్ ఎంతగానో ఉపయోగపడింది. అంతేగాకుండా మీ ఫ్యామిలీ మొత్తం బిజినెస్‌లో ఉంది. ప్రతిఒక్కరూ.. రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, అల్లు అర్జున్ ఇలా అందరూ సినీ ఫీల్డ్‌లో ఉన్నారు. మీరందరూ ఎంత అదృష్టవంతులో కదా..? మిమ్మల్ని చూసి నేను అనుకునేదల్లా.. పుడితే మీలాంటి రిచ్ ఫ్యామిలీలో పుట్టాలని.. మెగా ఫ్యామిలీలో కొత్త కొత్త బిజినెస్లు పుట్టుకొస్తున్నాయి. బాగా బిజినెస్ ఫ్యామిలీగా ఎదుగుతున్న మెగా ఫ్యామిలీకి రాజకీయాలు అచ్చిరాలేదు. అన్నయ్యగా చిరంజీవికి రాజకీయాల్లో అంతపేరు రాకపోవడంతో.. ప్రస్తుతం పవన్ కల్యాణ్ అనే మీరు రాజకీయాల్లోకి రాయేసి చూడాలని ప్రయత్నిస్తున్నారు. 
 
ఇటీవల మీ అన్నయ్య చిరంజీవి గారి 60వ పుట్టిన రోజు పార్టీ ఫోటోలు చూశా. ఎంతోమంది బాగా ధనికులైన సెలబ్రిటీలు పార్టీలో కనిపించారు. సూటుబూటుతో పార్టీకొచ్చారు. కానీ చాలామంది పిల్లలు డబ్బుల్లేక స్కూళ్లకు పోకుండా అవస్తలు పడుతుంటే ఇలాంటి అర్థం లేని బర్త్ డే పార్టీలేంటి?. ఇందులో ప్రాబ్లమ్ ఏంటంటే.. ఆ పార్టీకి మీరు కూడా సూటుబూటుతో వెళ్లడమే. మీరు సామాన్యులు కాదు. పవర్‌ఫుల్ కనెక్షన్స్ కలిగివున్నారు. రిచ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతానికి మీరు పేద ప్రజలకు ఆదుకోవాలనుకుంటే.. ఏదో ఒక ఎన్జీవో సంస్థ అంటే... పుట్టపర్తి సత్యసాయి బాబా ట్రస్టులా కొత్తది ప్రారంభించకూడదా? దేశంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. ఇలాంటి తరుణంలో మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు ప్రారంభించి పేద ప్రజలకు సేవ చేయకూడదా? ఇలాంటి కార్యక్రమాలకు ఉపాసన కామినేని సహాయం చేస్తారుగా.. ఎందుకంటే.. ఉపాసన దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఆస్పత్రిని కలిగివున్నారు కాబట్టి. 
 
ఇవన్నీ వదిలిపెట్టి.. రాజకీయాల్లో రావాలనే ఉద్దేశం ఉంది కనుకనే.. జనసేన పార్టీ పెట్టారు. ఇకపై ఇలాంటివన్నీ ఆపేయండి. ముఖ్యంగా ''మదర్ థెరిసా''లా నటించడం మానేయండి. రాజకీయాల్లో ఎంట్రీ కావడం అంత సులభం కాదు.. రాజకీయాల్లో రాణించేందుకు మీకేమీ తెలియదు. ఇప్పటికే జనసేనకు డబ్బుల్లేవని మీరే చెప్పారు. మీ పార్టీ ప్రశ్నార్థకంలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీని గ్రేట్ లీడర్ అన్నారు. ఆయన్ని గోద్రా అల్లర్లపై పవన్ కల్యాణ్ అయిన మీరు ప్రశ్నించగలరా? బీజేపీ-ఆర్ఎస్ఎస్ సంబంధాలపై అడగ్గలరా? ముస్లింలకు గల ప్రాధాన్యతపై ప్రశ్నించే సత్తా ఉందా? ముఖ్యంగా ఏపీ స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడగలరా? బీహార్ ప్యాకేజీ సంగతేంటి? ఆంధ్రాకు ప్యాకేజీ సంగతేంటి? ఇక కేసీఆర్‌ను పవన్ ప్రశ్నించగలరా? తెలంగాణలో రైతులు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని అడగ్గలరా? హరీష్ రావును కృష్ణా జలాలను ఆంధ్రా రైతులకు ఎందుకివ్వట్లేదని అడగ్గలరా?
 
అయితే చంద్రబాబును మాత్రం ప్రశ్నిస్తున్నారు? ఎందుకు మీరు తెలివైన రాజకీయనేత కాబట్టి. ఇంకా మీరు నటుడు కాబట్టి. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ రావడాన్ని ప్రోత్సహించడం ఇష్టం లేదా..? 98 శాతం రైతుల భూములు సేకరించబడ్డాయి. అయితే మీరు 2 శాతం రైతుల కోసం కేర్ తీసుకుంటున్నారు. ఎవరు పొలిటికల్‌ గేమ్‌ను ఉపయోగించుకుంటున్నారు? పవన్ గారైన మీరు మీ పార్టీని బలోపేతం చేసుకోవాలనుకుంటున్నారు. అంతా అయ్యాక పార్టీని పక్కాగా బరిలోకి దింపాలనుకుంటున్నారు. హైదరాబాద్ తెలంగాణకే పరిమితం కావడం పట్ల మీరు అప్‌సెట్ కావడానికి బిజినెసే కారణం.. చంద్రబాబు నాయుడు మళ్లీ అలాంటి క్యాపిటల్‌ను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నారు. వైజాగ్, కర్నూలు, చిత్తూరు, కాకినాడ ప్రాంతాలను పారిశ్రామిక వాడలుగా చేయాలనుకుంటున్నారు. 
 
అయితే ఈ రోజు లాండ్ ప్యూలింగ్‌కు విజయవాడలో వ్యతిరేకిస్తే.. రేపు వైజాగ్, అటు పిమ్మట తిరుపతుల్లోనూ వ్యతిరేకత పెరుగుతోంది. చివరికి కంపెనీలన్నీ కర్ణాటక, తమిళనాడుకు వెళ్లిపోతాయి. తద్వారా ఆంధ్రా మళ్లీ నష్టపోతుంది. వేలాది మంది యువత ఉపాధి కోసం వేచిచూస్తోంది. ఏపీలో ఎవరు జాబిస్తున్నారు. కానీ స్టుపిడ్ ట్వీట్స్ మాత్రం ఇస్తున్నారు. పవనిజం.. అంటున్న ఫ్యాన్స్‌కు ఉపాధి లేదు. అందుకే చెన్నైకి, బెంగళూరుకు, పూణేలకు వెళ్లిపోతున్నారు. అక్కడ పనిచేస్తూ నెలకు రూ.25వేలు సంపాదిస్తున్నారు. ఎందుకు ఈ బహిరంగ లేఖ రాశానంటే.. వీరిలో నేనూ ఒకడిని. నా గ్రామాన్ని, తల్లిదండ్రులను వదిలి ఉద్యోగం కోసం ఎక్కడో ఉంటున్నాను. అదే ఆంధ్రలో ఉద్యోగం లభిస్తే.. మెకానికల్ ఇంజనీర్‌గా రాష్ట్రంలోనే పనిచేస్తూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో పాలుపంచుకుంటాను. ఇంకా మా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటాను కాబట్టి. 
 
యువర్ సిన్సియర్లీ 
ప్రవీణ్.