Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఏపీ అసెంబ్లీ నిర్మాణంలో ఎన్నెన్ని ప్రత్యేకతలో.. మైకు విరగ్గొట్టలేరు... పోడియం ఎక్కలేరు

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (10:31 IST)

Widgets Magazine
ap assembly

నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ (అసెంబ్లీ) నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. విజయవాడ, గుంటూరు మధ్య ఉన్న వెలగపూడిలో అసెంబ్లీ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ భవన నిర్మాణంలో అధునాతన, అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. 
 
అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతమైన వసతులు, కళ్లు చెదిరే హంగులతో ఆంధ్రపదేశ్‌ నూతన అసెంబ్లీ రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే శాసనసభ సభాపతి పోడియంతోపాటు, మండలి పోడియం, సీటింగ్‌ పనులు పూర్తి అయ్యాయి. ఇంటీరియర్‌ పనులు తుది దశలో ఉన్నాయి. 
 
ప్రధాని నరేంద్ర మోడీ చేత కొత్త అసెంబ్లీ ప్రారంభోత్సవం చేయించటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాగా ఈ నూతన శాసనసభలో అల్లరి చేసి, గోల చేద్దాం అనుకునేవారి ఆటలు సాగవు. ఆ దిశగా ఎన్నో ప్రత్యేకతలతో సభ్యులకు చిన్న అసౌకర్యం కూడా కలగకుండా ఉండేలా అసెంబ్లీ రెఢీ అవుతోంది.
 
ఈ భవన నిర్మాణం కోసం జర్మనీ నుంచి అత్యాధునిక పరికరాలు దిగుమతి చేశారు. మైకు, వాయిస్‌ రికార్డర్‌ కలిపి ఒకే పరికరంగా టేబుల్‌ లోపల అమర్చి ఉంటుంది. నోటికి వచ్చినట్టు మాట్లాడటం.. తర్వాత ‘మేము అనలేదు’ అని తప్పించుకోవటం కుదరదు. 
 
అలాగే, కోపం వచ్చే మైకులు విరగ్గొట్టలేరు. స్పీకర్‌ పోడియం పైకి ఎక్కడానికి వీల్లేదు. సభలో సభ్యుల మాటలు ప్రతిధ్వనించకుండా స్పష్టంగా వినిపించేలా అధునాతన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Velagapudi Chandrababu Pm Modi Andhra Pradesh Assembly

Loading comments ...

తెలుగు వార్తలు

news

లోకేష్‌కు తెలంగాణ రాష్ట్ర బాధ్యతలా? ఎందుకు : టీటీడీపీ నేతలతో చంద్రబాబు

తన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు ...

news

ఏపీ గన్‌ను పేల్చేది జగన్ ఒక్కడే.. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ల అర్థం ఏమిటి?

మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ వంటి హీరోలపై ట్వీట్ల యుద్ధం చేస్తూ వచ్చిన వివాదాస్పద ...

news

ప్రేమ ముసుగులో మోసం.. పదేళ్ల ప్రేమ.. ఆపై సహజీవనం.. నిన్ను పెళ్లి చేసుకోననని మెసేజ్..

ప్రేమ ముసుగులో మహిళలను వేధింపులకు గురిచేసే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ప్రేమ ...

news

50 కిలోమీటర్లు.. పది గంటలు.. తల్లి మృతదేహంతో జవాను నడక..

దేశరక్షణ కోసం పాటుపడే ఓ వీర జవానుకు చేదు అనుభవం మిగిలింది. పఠాన్ కోట్‌లో జవానుగా ...

Widgets Magazine