శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By JSK
Last Modified: గురువారం, 14 జులై 2016 (12:34 IST)

జగన్, విజయసాయిలతో సుజనా క్లోజ్‌గా... విజ‌య‌సాయి రెడ్డిపై చంద్ర‌బాబు నిఘా...?!!

విజ‌య‌సాయి రెడ్డి. చాలాకాలం పాటు సాధార‌ణ ఆడిట‌ర్. అతికొద్దిమందికి మాత్ర‌మే తెలిసిన వ్య‌క్తి. అయితే అనూహ్యంగా జ‌గ‌న్ కేసుల పుణ్యాన రాష్ట్ర‌మంతా తెలిసిన నాయ‌కుడిగా మారిపోయారు. దాంతో రాజ‌కీయాల్లో ప్ర‌వేశించ‌డం ,ఇప్పుడు పార్ల‌మెంటులో అడుగుపెట్ట‌డం చాలా వ

విజ‌య‌సాయి రెడ్డి. చాలాకాలం పాటు సాధార‌ణ ఆడిట‌ర్. అతికొద్దిమందికి మాత్ర‌మే తెలిసిన వ్య‌క్తి. అయితే అనూహ్యంగా జ‌గ‌న్ కేసుల పుణ్యాన రాష్ట్ర‌మంతా తెలిసిన నాయ‌కుడిగా మారిపోయారు. దాంతో రాజ‌కీయాల్లో ప్ర‌వేశించ‌డం ,ఇప్పుడు పార్ల‌మెంటులో అడుగుపెట్ట‌డం చాలా వేగంగా జ‌రిగాయి. చంద్ర‌బాబు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లించ‌లేదు. చివ‌ర‌కు చాలా ఈజీగానే విజ‌య‌సాయి రెడ్డి  ఎంపీ అయిపోయారు. విజ‌య‌సాయి రెడ్డి వ్య‌వ‌హారాల‌న్నీ అంద‌రిక‌న్నా బాగా చంద్ర‌బాబుకి తెలుసు. ఆయ‌న సామర్థ్యం, వ్య‌వ‌హార ద‌క్ష‌త మీద బాబుకి బాగా అవ‌గాహ‌న ఉంది. అందుకే ఆయ‌న్ని ఎంపీ కాకుండా చూడ‌టం కోసం శ‌తివిధాలా ప్ర‌య‌త్నించి చివ‌ర‌కు చ‌తికిల‌ప‌డ్డారు. 
 
ఆ విష‌యం ప‌క్క‌న పెడితే ప్ర‌స్తుతం విజ‌య‌సాయి రెడ్డి ఢిల్లీలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. ఎంపీ హోదాలో ల‌భించిన ప్ర‌త్యేక స‌దుపాయాల‌ను ఆయ‌న వినియోగించుకుంటున్నారు. ఉన్న‌త విద్యావంతుడైన ఈ ఆర్థిక వ్య‌వ‌హారాల నిపుణుడు త‌న మార్క్ వ్య‌వ‌హారాలు న‌డుపుతున్నారు. దాంతో దాని ప్ర‌భావం చంద్ర‌బాబు మీద ప‌డుతోంది. చివ‌ర‌కు బాబుకి చిక్కులు తెచ్చిపెట్ట‌డం కూడా ఖాయ‌మ‌నే వాద‌న బ‌ల‌పడ‌ుతోంది.
 
అందుకే చంద్ర‌బాబు కూడా అప్ర‌మ‌త్త‌మ‌యిన‌ట్టు పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో చ‌ర్చ మొద‌ల‌య్యింది. విజ‌య‌సాయి రెడ్డి వ్య‌వ‌హారాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వాచ్ చేసేలా ప్ర‌త్యేక నిఘా కూడా ఏర్పాటు చేసిన‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఏ ఆఫీస్‌కి వెళుతున్నారు.. ఎవ‌రితో మాట్లాడుతున్నారు… ఏయే విష‌యాల పై దృష్టిపెడుతున్నార‌న్న విష‌యాల‌పై ఆరా తీస్తున్న‌ట్టు స‌మాచారం. అందులో భాగంగానే ఢిల్లీలో డెవ‌ల‌ప్‌మెంట్స్‌ని ఎప్ప‌టిక‌ప్పుడు అంద‌జేయాల్సిన సుజ‌నా చౌద‌రి అంత‌గా స్పందించ‌క‌పోవ‌డంతో చివ‌ర‌కు సొంత మ‌నిషిని అక్క‌డ పెట్టాల‌ని బాబు భావించిన‌ట్టు తెలుస్తోంది. నారా లోకేష్ ఢిల్లీ వ్య‌వ‌హారాలు అందులో బాగ‌మే అంటున్నారు. జ‌గ‌న్ , విజ‌య‌సాయిల‌తో కాస్త క్లోజ్‌గా ఉండే సుజ‌నాతో పెద్ద‌గా ప్ర‌యోజ‌నం లేద‌ని చంద్ర‌బాబు కూడా నిర్థార‌ణ‌కు వ‌చ్చేసిన‌ట్టు చెబుతున్నారు. 
 
సుజ‌నాని ఫాలోఅప్ చేయ‌డంతో పాటు, ఢిల్లీ వ్య‌వ‌హారాల్లో విజ‌య‌సాయి రెడ్డి ఎత్తుల‌ను ఎప్పటిక‌ప్పుడు క‌నిపెట్ట‌డానికే చిన‌బాబు ఢిల్లీ ప‌య‌నం అని కూడా తెలుస్తోంది. కొన్నాళ్ల పాటు తెలంగాణా అని, ఆ త‌ర్వాత ఆంధ్రప్ర‌దేశ్ అని ఇప్పుడు హ‌ఠాత్తుగా లోకేష్ బాబుని ఢిల్లీ రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టాల‌ని బాబు సూచించ‌డంలో అస‌లు మ‌త‌ల‌బు అదేన‌ని చాలామంది విశ్వ‌సిస్తున్నారు.
 
విజ‌య‌సాయి రెడ్డి వ్య‌వ‌హారాల స్థాయిని లోకేష్ చేరుకోవ‌డం చాలా క‌ష్టం అని భావిస్తున్నారు. గ‌తంలో విజ‌య‌సాయికి కూడా ఢిల్లీలో ఎవ‌రూ పెద్ద‌గా ప్రాధాన‌త్య‌నిచ్చే వారు కాదు. కానీ ఇప్పుడు ఎంపీగా ఆయ‌న‌కు అనేక అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. వాటిని స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో ఆయ‌న అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల‌ను కేంద్రం దృష్టికి తీసుకెళ్ల‌డంలో విజ‌య‌సాయిరెడ్డి అనుభ‌వం ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని చెబుతున్నారు. ఆయ‌న వ్య‌వ‌హారాల‌పై నిఘా పెట్టిన ప్ర‌త్య‌ర్థి పార్టీ ఎవ‌రిని రంగంలో దింపిన‌ప్ప‌టికీ పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని ఆశించ‌లేమంటున్నారు ఢిల్లీ పెద్ద‌లు. విజ‌య‌సాయి సామర్థ్యం ముందు చిన‌బాబు స‌హా ఎవ‌రైన‌ప్ప‌టికీ ఫ‌లితాలు క‌ష్ట‌మే అంటున్నారు. మ‌రి ఎలాంటి ఎత్తులు వేస్తారో చూడాలి.