బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2014 (15:54 IST)

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని భాజపా కేంద్రమంత్రి చేస్తుందా...? ఎందుకలా...?

సమైక్య ఛాంపియన్ గా ముద్రవేసుకున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురించి అసలు ఎలాంటి వార్తలు బయటకు రావడంలేదు. ఐతే ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డి భాజపాలో చేరుతున్నారంటూ ప్రచారం జరిగి మళ్లీ ఆగిపోయింది. తాజాగా మరోసారి కిరణ్ కుమార్ రెడ్డి గురించి మరో వార్త ప్రచారం జరుగుతోంది. 
 
కిరణ్ కు భారతీయ జనతా పార్టీ తగిన గౌరవాన్ని ఇవ్వడానికి సిద్ధమైందనీ, ఇందుకుగాను కిరణ్ ను పార్టీలో చేర్చుకొని ఆయనకు రాజ్యసభ పదవిని కట్టబెట్టడమే కాకుండా కేంద్రమంత్రి పదవిని కూడా ఇచ్చేందుకు రెడీ అవుతోందంటూ వార్తలు వస్తున్నాయి. సీమాంధ్రలో భాజపా బలపడాలంటే అలాంటి నేతలు రావాలని అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులను ఆకర్షించడం ద్వారా భవిష్యత్తులో సంస్థాగతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థిరపడాలన్న యోచనలో ఆ పార్టీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 
 
కానీ కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి భాజపాలో చేరినంత మాత్రాన సీమాంధ్రలో భాజపాకు సంబంధించి రాత్రికిరాత్రే అద్భుతాలేమీ జరుగవని కొందరంటున్నారు. అసలు చెప్పు గుర్తుతో పార్టీ జై సమైక్యాంధ్ర అంటూ పార్టీ పెట్టి సొంత నియోజకవర్గాల్లోనే గెలవలేని కిరణ్ కుమార్ రెడ్డితో భాజపాకు ప్రయోజనం ఎంతమేరకు అనే ప్రశ్నాస్త్రాలు సైతం సంధిస్తున్నారు. చూడాలి... ఏం జరుగుతుందో...?