మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By tj
Last Updated : సోమవారం, 3 ఏప్రియల్ 2017 (11:23 IST)

చంద్రబాబు ఏంటిది..? పార్టీ సభ్వత్వానికి రాజీనామా చేస్తా...?

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు వైఖరిపై తీవ్రంగా మండిపడుతున్నారు మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి. మంత్రి పదవి నుంచి తనను తొలగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బొజ్జల

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు వైఖరిపై తీవ్రంగా మండిపడుతున్నారు మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి. మంత్రి పదవి నుంచి తనను తొలగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బొజ్జల తన పార్టీ సభ్యత్వానికి రాం రాం చెప్పేందుకు సిద్ధమయ్యారట. ఎప్పుడూ గోపాల్ గోపాల్... అంటూ ఆప్యాయంగా పిలిచే అధినేత తనను అవమానించేవిధంగా ప్రవర్తిస్తే ఎవరైనా ఊరుకుంటారా. అదే బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి చేస్తున్నారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బొజ్జల వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
 
ఏపి కేబినెట్‌లో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖుల్లో సిఎం చంద్రబాబునాయుడు, మంత్రిగా ఉన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలే. తన సొంత జిల్లాలో ఉన్న వ్యక్తికి పెద్ద శాఖనే ఇచ్చారు బాబు. అది కూడా అటవీశాఖ. శేషాచలం అడవులను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండున్నర సంవత్సరాలు గడిచాయి. అయినా బొజ్జల మాత్రం ఆ శాఖపై పట్టుసాధించలేకపోయారు. మంత్రిగా ఉన్నారు తప్ప మంత్రి పదవికి న్యాయం చేయలేకపోయారన్నది బాబు అభిప్రాయం. ఈ విషయం పక్కన బెడితే మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని బొజ్జల కుటుంబ సభ్యులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని కొంతమంది సీనియర్లే స్వయంగా బాబు దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో బొజ్జలపై ఎంతో గుర్రుగా ఉన్న బాబు.
 
మంత్రి పదవి నుంచి తొలగిస్తామని కనీసం ఒక్కమాట కూడా చెప్పకుండా పదవి నుంచి తీసేయడంపై తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారు బొజ్జల. దీంతో మొదటగా రాజీనామా లేఖను సమర్పించింది ఆయనే. మంత్రిగా పనిచేయని తాను ఎమ్మెల్యేగా కూడా పనిచేయలేనన్నది బొజ్జల వాదన. దీంతో అధినేత ఏమనుకున్నా ఫర్వాలేదనుకుని లేఖను ఫ్యాక్స్ చేశారు. కేబినెట్ ముగిసిన వెంటనే చంద్రబాబు మూడుసార్లు బొజ్జల కోసం ప్రయత్నించారు. ఫోన్‌లో మాట్లాడుతుండగా బాబు ఏంటిది అంటూ గద్గద స్వరంతో బొజ్జల అధినేతపై ఊగిపోయారు. 
 
ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరికొన్ని రోజుల్లో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని బాబుతో చెప్పి ఫోన్ కట్ చేశారట. దీంతో బాబు నచ్చజెప్పాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందట. నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని రంగంలోకి దింపిన బాబు బొజ్జలను బుజ్జగించమని చెప్పారట. బొజ్జల మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గదానికి ఏ మాత్రం ఇష్టం పడడం లేదని ఆయన వర్గీయులే చెబుతున్నారు.