బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: శుక్రవారం, 5 ఆగస్టు 2016 (19:44 IST)

ఏపీ ప్రత్యేక హోదా బంతి లోక్ సభకు... ఆంధ్రలో చంద్రబాబుకు అగ్ని పరీక్షే...?

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రవేశపెట్టిన ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లును డిప్యూటీ స్పీకర్ కురియన్ ఓటింగుకు తోసిపుచ్చుతూ ఈ బిల్లు మనీ బిల్లని కేంద్ర ఆర్థికమంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు కనుక లోక్ సభ స్పీకరుకు పం

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రవేశపెట్టిన ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లును డిప్యూటీ స్పీకర్ కురియన్ ఓటింగుకు తోసిపుచ్చుతూ ఈ బిల్లు మనీ బిల్లని కేంద్ర ఆర్థికమంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు కనుక లోక్ సభ స్పీకరుకు పంపనున్నట్లు చెప్పారు. ఐతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు భాజపా వెనకడుగు వేస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఐతే ఏపీ ప్రత్యేక హోదాపై ఇంత రాద్ధాంతం, మెలికలు పడిపోవడానికి మూలకారణం కాంగ్రెస్ పార్టీయేనని తెదేపా మండిపడుతోంది. రాష్ట్ర విభజనకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో ప్రత్యేక హోదాను జోడించి ఉన్నట్లయితే ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు. చట్టంలో చేర్చకుండా తప్పుడు పనులు చేసి ఇప్పుడు మళ్లీ దానిపై రాద్దాంతం చేయడంపై మండిపడుతున్నారు. 
 
మరోవైపు ఏపీ విభజన జరిగి రెండేళ్లు కావస్తున్నా ప్రత్యేక హోదాపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా దాన్ని నానబెడుతూ ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాజపా నామమాత్రంగా ఉండటంతో దానిపై భాజపా నేతృత్వంలోని కేంద్రం అంత సీరియస్‌గా తీసుకోవడం లేదనే వాదనలు వినబడుతున్నాయి. దీనితో ఏపీ ప్రజల అసంతృప్తి పాలక పార్టీ తెలుగుదేశం పార్టీపైన పడుతోంది. సాధ్యమైనంత త్వరలో ఏపీ ప్రత్యేక హోదాను తెదేపా రాబట్టలేకపోతే వచ్చే ఎన్నికల్లో తెదేపాకు గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమని చెప్పక తప్పదు.