Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భూమా నాగిరెడ్డికి అదంటే చాలా ఇష్టమట..! ఏంటది..?

సోమవారం, 13 మార్చి 2017 (16:02 IST)

Widgets Magazine
bhuma nagireddy shoba nagireddy

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆదివారం గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబ రాజకీయాల్లోనే కాకుండా సినీ రంగంలోనూ రాణించింది. వీరబ్రహ్మేంద్ర కంబైన్స్‌ మూవీ క్రియేషన్‌ సంస్థ పేరుతో పలు చిత్రాలను రూపొందించారు. సుమన్‌ కథానాయకుడిగా పలు చిత్రాలను నిర్మించారు. భూమా నాగిరెడ్డి నిర్మాతగా ఊహ కథానాయికిగా ‘నా కూతురు’ అనే చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో నిర్మించారు. పలు చిత్రాలకు బయ్యర్లుగా వ్యవహరించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ భూమా నాగిరెడ్డికి మంచి మిత్రులు. మోహన్‌బాబు కుటుంబంతో భూమా కుటుంబానికి ఎంతో ఆత్మీయానుబంధం ఉంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో కూడా ఎంతో సన్నిహితంగా ఉండే వారు.
 
భూమా నాగిరెడ్డికి మంత్రి కావాలని కోరిక ఉండేదని, అది నెరవేరకుండానే మృతిచెందారని ఆయన సన్నిహితులు, అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికి ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఎప్పటికైనా మంత్రి అవ్వాలని ఆయన అనుకునేవారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ విస్తరణలో భూమాకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని ఇటీవల వార్తలు వచ్చాయి. 
 
ఈ మధ్యకాలంలో చంద్రబాబుతో ఆయన పలుమార్లు భేటీ కావడం కూడా ఈ వార్తలకు వూతమిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆయనకు మంత్రి పదవి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతలోనే భూమా నాగిరెడ్డి మృతిచెందడతో ఆయన అనుచరులు షాక్‌ గురవుతున్నారు. మంత్రి కావాలన్న కోరిక తీరకుండానే తమ నేత ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారని కన్నీరు పెడుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భూమా పార్థివదేహం పక్కనే నంద్యాల అసెంబ్లీ సీటు కేటాయింపుపై లోకేశ్ చర్చలు?

ఒకవైపు భూమా నాగిరెడ్డి పార్థివదేహం. మరోవైపు నంద్యాల అసెంబ్లీ టిక్కెట్‌ను ఎవరికి ...

news

నీకు ఆఫీసులో పనెందుకు? నాతో సహకరించు హీరోయిన్ చేస్తా... రమ్మన్న నిర్మాతను...

కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై ఒకవైపు సుచీ లీక్స్ రూపంలో కుదుపులకు గురి చేస్తుంటే ఇటువపై మన ...

news

దీపా జయకుమార్‌ను బెదిరిస్తున్న గూండాలు.. ఓపీఎస్‌కు మరో ఎమ్మెల్యే మద్దతు

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌కు రాజకీయాల్లో చేదు అనుభవాలు ...

news

మనసు సహకరించిందో లేదో కానీ బాడీ సహకరించలేదు... భూమా మరణం వెనుక?

రాయలసీమ రాజకీయాలంటేనే మర్చి ఘాటంతగా వుంటాయి. ఇక్కడి రాజకీయ నాయకులు ఏదీ మనసుల్లో దాచుకోరు. ...

Widgets Magazine