Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రజినీ సర్.. మోడీ సాబ్ రమ్మంటున్నారు... ఎవరు..?

మంగళవారం, 8 ఆగస్టు 2017 (20:40 IST)

Widgets Magazine
poonam mahajan

తమిళ సినీ సూపర్ స్టార్, తమిళ తలైవా రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖరారైన నేపథ్యంలో ఆయన్ను ఎలాగైనా బిజెపిలోకి తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. రజినీ సొంత పార్టీ పెట్టి కొత్తవారిని తీసుకోవడం కన్నా జాతీయ పార్టీతో రజినీ కలిసి ఉంటే తమ పార్టీ మరింత ముందుకెళ్ళడంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి కనుసన్నల్లోనే ప్రభుత్వం నడుస్తుందన్న ఆలోచనలో ఉన్నారు మోడీ.
 
ఇప్పటికే ప్రధాని, రజినీ కలిశారు. బిజెపిలోకి రజినీని మోడీ స్వయంగా ఆహ్వానించారు. మీ వెనుక మేమున్నామంటూ అభయమిచ్చారు. తమిళనాడు బిజెపి అధ్యక్షుడిగా మిమ్మల్నే నియమిస్తామని హామీ ఇచ్చారు. అయితే అన్ని విన్న రజినీ మాత్రం ప్రధాని సలహాను సున్నితంగా తిరస్కరించారు. ఇప్పట్లో తనకు రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదని చెప్పారు.
 
కానీ రాజకీయాల్లోకి రావాలనుకున్న నిర్ణయాన్ని మాత్రం మానుకోలేదు. రాజకీయ విశ్లేషకులు, వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నేతల సలహాలను తీసుకుంటూనే ఉన్నారు. అంతటితో ఆగలేదు రజిని. అభిమానుల సలహాలను కూడా స్వీకరించారు. ఈనెల 22వతేదీ చెన్నైలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించనున్నారు. అమిత్ షా పర్యటనలో నేరుగా ఆయన రజినీని కలిసే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
 
తాజాగా బిజెపి యువ మోర్చా జాతీయ అధ్యక్షురాలు పూనమ్‌ మహాజన్‌ రజినీని కలిశారు. గంటపాటు జరిగిన వీరి భేటీలో రాజకీయాలే ఎక్కువగా ప్రస్తావన వచ్చిందట. మోడీ సాబ్ మిమ్మల్ని బిజెపిలోకి రమ్మంటున్నారు. మీరు బిజెపిలోకి బాగుంటుంది. బిజెపి... కేంద్ర పార్టీ. నేను ఆ పార్టీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అంటూ బిజెపి నాయకురాలు రజినీకి చెప్పినట్లు తెలుస్తోంది. 
 
అయితే రజినీ మాత్రం అన్నీ విని దీని గురించి బాగా ఆలోచిస్తాను అని చెప్పారట. వీరిద్దరి భేటీ ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకుంది. అందులోను 22వతేదీ అమిత్ షా చెన్నైలో పర్యటిస్తుండడంతో రజినీ ఆ రోజు బిజెపి తీర్థం పుచ్చుకుంటారని రజినీ అభిమానులు చెప్పుకుంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కంట తడిపెట్టిన వెంకయ్య.. ఎందుకో తెలుసా?

ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ముప్పవరపు వెంకయ్యనాయుడు కంట తడి పెట్టారు. నెల్లూరు జిల్లాలో ...

news

చాక్లెట్ తీసిస్తానని.. బాలికను లోబరుచుకున్నాడు.. పెదవులు కొరికాడు.. ఇంతలో?

తమిళనాడు, సేలం జిల్లాలో తొమ్మిదేళ్ల చిన్నారిని చాక్లెట్ తీసిస్తానని చెప్పి ఓ మెకానిక్ ...

news

రోజాది చింతామణి క్యారెక్టర్... ఆల్కహాల్ టెస్టు జరిపించాలి: బుద్ధా వెంకన్న

సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ చేసిన సంచలన వ్యాఖ్యలతో ప్రారంభమైన టీడీపీ, వైసీపీ కామెంట్లు ...

news

డొనాల్డ్ ట్రంప్ కుమార్తె హైదరాబాద్‌కు వస్తున్నారు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. అమెరికా ...

Widgets Magazine