Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రియుడి మోజులో ఇద్దరి పిల్లల తల్లి... అందుకే తిరుమల చిన్నారి కిడ్నాప్... ఇదీ స్టోరీ(వీడియో)

సోమవారం, 3 జులై 2017 (12:32 IST)

Widgets Magazine
kidnapers

అక్రమ సంబంధం ఎంతటి పనినైనా చేయిస్తుంది. అది అందరికీ తెలిసిందే. వావివరసలు మరిచిపోయి కొంతమందైతే ఇళ్ళు వదిలి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. మరికొంతమందైతే పెళ్ళిళ్ళు చేసుకుని కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయిన వారు లేకపోలేదు. అలాంటి సంఘటనే తమిళనాడు రాష్ట్రం నామక్కల్‌లో జరిగింది. సంఘటన అక్కడ జరిగితే ఆ కథకు ముగింపు తిరుమల వేదికైంది. 
 
తమిళనాడు రాష్ట్రం నామక్కల్ సమీపంలోని రాశిపురం. కొండకు దగ్గరగా ఉన్న ప్రాంతం. అశోక్, తంగవై వీరు పక్కపక్క ఇంటివారు. అశోక్ ఈమధ్యనే చదువు పూర్తిచేసి స్థానికంగా పనిచేసుకుంటున్నాడు. తంగవైకు పెళ్ళయి ఇద్దరు కూతుళ్ళు కూడా ఉన్నారు. పక్కపక్కనే ఇళ్ళు కావడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి ఆ తరువాత అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో తంగవై భర్త, కూతుళ్ళను వదిలిపెట్టి ప్రియుడితో కలిసి బయటకు వచ్చేసింది. ఇద్దరూ కలిసి ఒకటిన్నర సంవత్సరం పాటు బెంగళూరులోనే ఉన్నారు. నిన్నేమీ అనము ఇంటికి వచ్చెయ్.. అంటూ అశోక్ ఇంటిలో ఒత్తిడి ఎక్కువ కావడంతో తంగవైను తీసుకుని ఇంటికి వచ్చాడు.  
 
తల్లిదండ్రుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయాడు. తామిద్దరం కలిసి ఉండటం వల్ల తమకు ఒక బాబు పుట్టాడని అశోక్ తన కుటుంబ సభ్యులను నమ్మబలికాడు. తంగవై కూడా అలాగే చెప్పేసింది. అయితే పిల్లాడిని తీసుకురమ్మని అశోక్ ఇంటిలో చెప్పడంతో ఇద్దరూ కలిసి ఆలోచించారు. పిల్లాడు ఎలాగైనా కావాలన్న ఉద్దేశంతో కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే తిరుమలను వేదికగా చేసుకున్నారు. ఇద్దరూ కలిసి తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చారు. దర్శనం చేసుకుని ఆ తరువాత గొల్లమండపం వద్ద సేదతీరారు. పిల్లలు ఎవరికి ఎంతమంది ఉన్నారో చూడటం ప్రారంభించారు. అప్పుడే అనంతపురం జిల్లాకు చెందిన వెంకటేష్‌ కుటుంబం నలుగురు పిల్లలతో గొల్లమండపం ముందే సేదతీరింది.
 
ఇక అశోక్‌, తంగవై ప్లాన్ చేశారు. నువ్వు ఆలయం వెనుక ఉండి నేను చిన్నారిని తీసుకొస్తానని చెప్పాడు. చెప్పినట్లుగానే వెంకటేష్‌ కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉంటే చిన్నారిని ఎత్తుకెళ్ళాడు. అనుకున్న విధంగా ఆలయం వెనుక వెళ్ళి తంగవైకి చిన్నారికి ఇచ్చాడు. బాబు ఎవరికీ కనిపించకుండా టవల్ కప్పి ఇక తీసుకెళ్ళిపోయారు.  నేరుగా స్వగ్రామానికి చేరుకుని చిన్నారి చెన్నకేశవులను అశోక్ తల్లిదండ్రులకు చూపించారు. అయితే అక్కడే ఒక ట్విస్ట్ చిన్నారి పాలు తాగలేదు. రెండు,మూడు రోజులుగా ఇదే తంతు. చిన్నారిని ఎంత బుజ్జగించినా ఫలితం లేకుండా పోయింది. చిన్నారి ఏడుస్తూనే ఉన్నాడు.
 
అశోక్ తల్లిదండ్రులకు అనుమానం వచ్చేసింది. దీంతో పాటు తిరుమలలో చిన్నారి తప్పిపోయాడని తమిళ టీవీ ఛానళ్ళు, పేపర్లలో ప్రకటనలు రావడం ప్రారంభమయ్యాయి.  తరువాత తమిళనాడు బస్సుల వెనుక చిన్నారి ఫోటోలు కూడా కనిపించాయి. కిడ్నాపర్ల ఫోటోలు వీరిద్దరివే. ఇక అశోక్ తల్లిదండ్రులు నిర్ణయానికి వచ్చేశారు. చిన్నారిని తీసుకెళ్ళి పోలీస్టేషనులో అప్పగించమని చెప్పారు. వారిద్దరూ ససేమిరా అనడంతో బలవంతంగా లాక్కెళ్ళి పోలీస్టేషన్‌లో అప్పగించారు. అలా తిరుమలలో కిడ్నాప్ అయిన చిన్నారి చెన్నకేశవుల కథ సుఖాంతమయితే అక్రమ సంబంధం పెట్టుకున్న అశోక్, తంగవైలు జైలులో ఊచలు లెక్కిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

టేకాఫ్ అయిన వెంటనే పనిచేయని ఏసీ వ్యవస్థ.. పేపర్లే విసనకర్రలు...

ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా విమానం ఒకటి ప్రయాణికులను తీవ్రఅవస్థలకు ...

news

రాష్ట్రపతి ఎన్నికల్లో మెగాస్టార్ మొదటి ఓటు... వ్యతిరేకమా..? అనుకూలమా..?

సినిమాల్లో బిజీ అయిపోయిన తరువాత చిరంజీవి రాజకీయాలు దూరంగా ఉంటూ వస్తున్నారు. కాంగ్రెస్ ...

news

పేరుకే స్పా సెంటర్... లోపల విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం.. ఎక్కడ?

స్పా సెంటర్ పేరుతో లోపల విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం చేస్తున్న గుట్టును పోలీసులు బహిర్గతం ...

news

మగవారితో వ్యభిచారం.. పాకిస్థాన్ యువకుడి నిర్వాకం.. ఎక్కడ?

సాధారణంగా వ్యభిచారవృత్తిలో అమ్మాయిలు నిమగ్నమవుతుంటారు. కానీ, ఇక్కడ ఉపాధి కోసం వెళ్లిన ఓ ...

Widgets Magazine