గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By JSK
Last Modified: మంగళవారం, 18 అక్టోబరు 2016 (12:46 IST)

చైనా వాతలు పెడుతున్నా... ఆ దేశ వస్తువులను భారతీయులు కొంటూనే వున్నారు...

బ్రిక్స్ సమావేశంలో పాకిస్తాన్ దేశంపై ఈగ వాలకుండా చైనా తనవంతు పాత్రను పోషించింది. దీనికితోడు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు చైనా పరోక్ష మద్దతు లభిస్తుందనే వాదనలు కూడా వస్తున్నాయి. దీనితో మన దేశంలో చైనా వస్తువులను కొనరాదంటూ ఆమధ్య కొంతమంది రాజకీయ నాయకులు, స

బ్రిక్స్ సమావేశంలో పాకిస్తాన్ దేశంపై ఈగ వాలకుండా చైనా తనవంతు పాత్రను పోషించింది. దీనికితోడు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు చైనా పరోక్ష మద్దతు లభిస్తుందనే వాదనలు కూడా వస్తున్నాయి. దీనితో మన దేశంలో చైనా వస్తువులను కొనరాదంటూ ఆమధ్య కొంతమంది రాజకీయ నాయకులు, సోషల్ మీడియాలో ప్రచారం చేసినప్పటికీ భారతీయులు మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ఆ దేశంలో తయారవుతున్న వస్తువులను కొనేస్తున్నారు. ఐతే వారు కొంటున్నది ఫలానా దేశానికి సంబంధించినదా కాదా అని చూడకపోవడంవల్లనే ఇలా చైనా వస్తువులకు గిరాకీ పెరుగుతోందంటున్నారు. అక్టోబరు దీపావళి పండుగ సందర్భంగా చైనా మొబైల్ ఫోన్ క్జియామీ సుమారు 5 లక్షలు అమ్ముడయ్యాయి. 
 
ఈ ఫోన్‌ను ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్ ద్వారా ఇండియన్స్ కొనేశారు. ఇదంతా కేవలం అక్టోబరు మొదటి వారంలోనే జరిగిపోయింది. ఇంకా చైనా ఉత్పత్తుల కోసం ఇండియన్స్ ఎగబడుతున్నట్లు ఆ దేశంలో మీడియా కథనాలు రాస్తోంది. మరోవైపు చైనా వ్యాపారాన్ని కాపాడే అతి పెద్ద మార్కెట్ ఉన్న దేశం భారత దేశమే. ప్రతి సంవత్సరం 60 లక్షల కోట్లు మన డబ్బు చైనాకి వెళ్తుంది. ఊహించడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది అక్షర సత్యం. అందుకే.. మనం చైనా వస్తువులు కొనకపోతే చైనా ఆర్థిక వ్యవస్థ ఊహించని విధంగా దెబ్బతింటుంది. మనం మనదేశంలో తయారయ్యే వస్తువులు కొనటం వల్ల మన ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇదే కనుక మనం కొనసాగించగలిగితే.... మనం చైనాని ఆదేశించే రోజు త్వరలోనే వస్తుంది. 
 
* ముందుగా మీరు కొనే వస్తువుపై ఉన్న బార్ కోడ్‌ని గమనించండి.
* బార్ కోడ్‌లో ముందు మూడు అంకెలు ఏ దేశానికి చెందినదో తెలుపుతాయి.
* ఆ బార్ కోడ్‌లో ముందు మూడు అంకెలు 690 నుండి 695 లోపు ఉంటే అది చైనా వస్తువు అని అర్థం.
 
చైనా కంపెనీల లిస్టు:
Alcatel (subsidiary of TCL Corporation)
Amoi
BBK
Coolpad
Cubot
Gfive
Gionee
Haier
Hisense
Huawei
Konka
Lenovo (also its subsidiary Motorola Mobility)
LeEco (Letv)
Meizu
OnePlus (subsidiary of BBK)
Oppo (subsidiary of BBK)
Qihoo 360
QiKU (joint venture of Qihoo 360 and Coolpad)
Ningbo Bird
Smartisan
Technology Happy Life
Vivo (subsidiary of BBK)
Vsun
Wasam
Xiaomi
Zopo Mobile
ZTE
ZUK Mobile (subsidiary of Lenovo)
 
భారత కంపెనీల లిస్టు:
Celkon
iball
Intex Technologies
Karbonn Mobiles
Lava International
LYF
Micromax Informatics
Onida Electronics
Ringing Bells
Spice Digital
Videocon India
Xolo (Subsidiary of Lava International)
YU Televentures (Subsidiary of Micromax Informatics)