శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : సోమవారం, 12 అక్టోబరు 2015 (16:09 IST)

అమరావతి పిలుస్తోంది.. హైదరాబాద్‌కు బై..బై.. సినీ పరిశ్రమ షిఫ్ట్ ఖాయమేనా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో ఒకప్పుడు అభివృద్ధి చెందిన హైదరాబాదుకు రాష్ట్ర విభజన తర్వాత కళ తప్పిందని విశ్లేషకులు అంటున్నారు. సీమాంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు అని విడిపోయాక.. ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. సినీ పరిశ్రమ మాత్రం ఏపీకి తరలిపోనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
 
తెలుగు సినీ పరిశ్రమ కూడా రాష్ట్ర విభజన తర్వాత విడిపోతుందని టాక్ వస్తున్న నేపథ్యంలో.. హైదరాబాదు నుంచి టాలీవుడ్ ఏపీకి తరలిపోనుందనే అనుమానాలను బలపడతున్నాయి. మరికొందరు హైదరాబాదు కంటే అమరావతిలో సకల సౌకర్యాలు లభిస్తే అక్కడికెళ్లడం ఖాయమంటున్నారు.
 
అయితే సినీ పరిశ్రమ అనేది చాలా పెద్ద ఆదాయ వనరు. పైగా గ్లామర్ ఉన్న ఇండస్ట్రీ. దీని ద్వారా వచ్చే ప్రచారం అంతా ఇంతా కాదు. అలాంటి పరిశ్రమ తమ రాష్ట్రంలో అడుగుపెట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో సినీ సీమనుఅమరావతి రప్పించేందుకు పక్కా ప్రణాళికతో చంద్రబాబు వ్యూహం రచిస్తున్నట్లు తెలిసింది. వెంట వెంటనే కాకపోయిగా నెమ్మదిగా సినీ పరిశ్రమలు వైజాగ్ లాంటి ప్రాంతాలకు తీసుకురావడానికి బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
ఇందులో భాగంగానే భీమలి-విశాఖపట్నం రోడ్డులోని వజ్ర ఆశ్రమం దగ్గర ఫిలిం నగర్ కల్చరల్ సొసైటీ (ఎఫ్ ఎన్ సీసీ)కి ఆయన శంకుస్థాపన చేస్తున్నారు. దాదాపు 15 ఎకరాల్లో ఈ సొసైటీని డెవలప్ చేయబోతుండటం విశేషం. కొండ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ ప్రదేశంలో కన్వెన్షన్ హాల్ - హోటళ్లు - ఇతర భవనాలను ఏపీ సర్కారు నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది. 
 
ఈ పనులన్నీ పూర్తయ్యాక సినీ ఇండస్ట్రీ మెల్ల మెల్లగా హైదరాబాదు నుంచి అమరావతికి షిఫ్ట్ కాబోతోందని తెలిసింది. ఇప్పటికే విశాఖపట్నంలో దివంగత రామానాయుడు స్టూడియో కూడా కట్టారు. కాకపోతే ఇంకా అక్కడ షూటింగులు ఊపందుకోలేదు. ఒక్కసారి ఆ ఊపు వస్తే వైజాగ్ సినీ పరిశ్రమకు కేంద్రంగా మారొచ్చని అంచనా వేస్తున్నారు. ఇదంతా ఓకే అయితే హైదరాబాదు నుంచి అమరావతి సినిమా వాళ్లొచ్చేస్తారని సినీ పండితులు అంటున్నారు.