గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Updated : శనివారం, 17 సెప్టెంబరు 2016 (15:14 IST)

సెప్టెంబరు 20 తర్వాత తమిళనాడు గింజుకున్నా నీళ్లివ్వం... కర్నాటక సర్కారు పడిపోయినా ఫర్లేదు.... సిద్ధ సై?

కావేరి జలాల సమస్య రానురాను జఠిలమవుతుందా...? కర్నాటక-తమిళనాడు మధ్య నీటి యుద్ధం తారాస్థాయికి వెళుతుందా...? అంటే అవుననే అనుకోవాల్సి వస్తుంది తాజా పరిణామాలను చూస్తుంటే. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తమి

కావేరి జలాల సమస్య రానురాను జఠిలమవుతుందా...? కర్నాటక-తమిళనాడు మధ్య నీటి యుద్ధం తారాస్థాయికి వెళుతుందా...? అంటే అవుననే అనుకోవాల్సి వస్తుంది తాజా పరిణామాలను చూస్తుంటే. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తమిళనాడుకు కావేరి జలాలను విడుదల చేయడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. తన సహచర మంత్రుల వద్ద ఇదే విషయాన్ని ఆయన వెళ్లగక్కినట్లు తెలుస్తోంది. 
 
సుప్రీంకోర్టు తీర్పు నేపధ్యంలో ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రానికి కావేరి జలాలను విడుదల చేస్తున్నప్పటికీ సెప్టెంబరు 20వ తేదీ తర్వాత తమిళనాడు రాష్ట్రం గింజుకున్నా నీళ్లు ఇచ్చేది లేదని ఆయన మంత్రుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. కావేరి జలాల వివాదంపై సెప్టెంబరు 20న సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరుగనుంది. ఈ విచారణలో సుప్రీంకోర్టు మళ్లీ తమిళనాడుకు కావేరి జలాలను ఇవ్వాలని చెబితే ప్రజాకోర్టుకు వెళ్లేందుకు అంతా సిద్ధంగా ఉండాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు చెప్పినట్లు సమాచారం. 
 
ప్రభుత్వం కూలిపోయినా తాము పట్టించుకోమని ఆయన అన్నట్లు సమాచారం. కావేరి జలాలను విడుదల చేసి తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నామనీ, ఇప్పటికే బెంగళూరు, మైసూరు నగరాలకు తాగునీటి కష్టాలు ఎదురవుతాయనీ, అందువల్ల భవిష్యత్తులో ఇంకా నీటి విడుదల సాధ్యం కాదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. 
 
సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు తీర్పులతో కర్నాటక తీవ్రంగా నష్టపోయిందనీ, మళ్లీ మూడో తీర్పుతో కర్నాటకకు మేలు జరిగితే ఫర్వాలేదు కానీ తమిళనాడుకు కావేరి జలాలు విడుదల చేయాల్సిందేనని చెబితే మాత్రం తాము ప్రజాకోర్టుకు వెళతామని ఆయన చెప్పినట్లు సమాచారం. కోర్టు తీర్పును పెడచెవిన పెడితే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేసే అవకాశం ఉంటుంది. అలా జరుగక మునుపే తామే చర్యలు తీసుకుని ప్రజల ముందుకు వెళతామని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో సెప్టెంబరు 20వ తేదీపై ఉత్కంఠ సాగుతోంది.