మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2016 (19:11 IST)

2019 ఎన్నికల్లో పవన్‌దే హవా.. షాకిస్తోన్న సర్వే ఫలితాలు: ''కింగ్ మేకర్'' ఆయనేనా?!

ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు పాలనపై ''సెంటర్ ఫర్ మీడియా స్టడీస్'' సంస్థ నిర్వహించిన సర్వేలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు 67 శాతం మంది అనుకూలంగా తీర్పు ఇవ్వగా, చంద్రబాబు స్థాయిలో ఆయన కేబినెట్‌లోని మంత్రులు ఏమాత్రం పనిచేయట్లేదని సర్వేలో ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు తీసుకొస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అనిశ్చితి ఉందని.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని ఈ సర్వే ఫలితాలు తేల్చాయి. 
 
ఇక ఈ సర్వేలో తేలిన విషయం ఏమిటంటే..? గతంలో కంటే ఏపీలో అవినీతి బాగా పెరిగిందని తేలింది. రెవెన్యూ, పోలీసు, విద్య, వైద్య రంగాల్లో అవినీతి 33 శాతం పెరిగిపోవడంతో ప్రజల్లోకి చొచ్చుకువెళ్లే స్థాయిలో పథకాలేవీ కనబడటం లేదని జనం అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ.. ఏ రాజకీయ పార్టీ కూడా దీన్ని క్యాష్ చేసుకోలేకపోతున్నాయని సర్వేలో వెల్లడైంది. కానీ కొత్త రాజకీయ శక్తి వచ్చేందుకు రాష్ట్రంలో అవకాశం ఉందని జనం చెప్తున్నారు. 
 
ఈ సర్వేలో ఏపీలో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించేందుకు అవకాశం ఉందని సర్వేలో తేలింది. ఆ రాజకీయ శక్తి పవన్ కల్యాణే అని అప్పుడే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. పవన్ ఎలాగో 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడం.. సినిమాలను పక్కనబెట్టి సీరియస్‌గా రాజకీయాల్లో దిగుతానని ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పడం ద్వారా ఆ కొత్త రాజకీయ శక్తి పవనేనని రాజకీయ పండితులు చెప్తున్నారు. 
 
ఏపీలో గల అనిశ్చితిని పవన్ పక్కాగా ప్లాన్ చేసి క్యాష్ చేసుకుంటూ ప్రజల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెడితే పవన్‌కు ఏపీలో బ్రహ్మరథం పడతారని.. కానీ అసమర్థతతో వ్యవహరిస్తే మాత్రం ఫలితాలు తారుమారయ్యే ఛాన్సుందని సర్వే తేల్చింది. ఇక రాజకీయాల్లోకి రాకముందు.. పవన్ బస్సు యాత్ర ద్వారా ప్రజల సమస్యల గురించి తెలుసుకోనున్నారని.. ఓ వైపు ఏపీలో మెజారిటీ భాగం ఉన్న కాపు సామాజిక వర్గం నుంచి.. ఫ్యాన్స్, యూత్ నుంచి అతడికి బలమైన ఉంటుందని సర్వే తేల్చింది. దీంతో పవన్ కల్యాణ్ 2019 స్థానిక ఎన్నికల్లో ''కింగ్ మేకర్'' అయిపోవడం ఖాయమని రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు.