బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (14:53 IST)

చంద్రబాబు "భోజనం ఫోన్‌కాల్‌"పై టీడీపీ నేతల్లో వణుకు

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలకు మరో యేడాది మాత్రమే సమయం ఉంది. దీంతో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకవైపు ప్రభుత్వ పాలన చూస్తూనే, మరోవైపు పార్టీ పరిస్థితులను చక్క

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలకు మరో యేడాది మాత్రమే సమయం ఉంది. దీంతో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకవైపు ప్రభుత్వ పాలన చూస్తూనే, మరోవైపు పార్టీ పరిస్థితులను చక్కబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం మా ఇంటికి భోజనంకు రండి అనే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. అంటే పార్టీ పరిస్థితులపై ఆరా తీసేందుకు పార్టీ నేతలకు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి చర్చలకు ఆహ్వానించనున్నారు. ఇలా తన ఇంటికి వచ్చే వారికి కడుపునిండా భోజనం వడ్డించి.. ఆ తర్వాత క్లాస్ పీకనున్నారు. దీంతో టీడీపీ నేతలు హడలిపోతున్నారు. అందుకే చంద్రబాబు భోజనం ఫోన్ కాల్ మాటెత్తితో వారు వణికిపోతున్నారు. ఇంతకీ అసలు విషయం పరిశీలిద్ధాం. 
 
రాష్ట్రంలోని అనేక అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఇలాంటి స్థానాలపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపెడుతున్నారు. అదేసమయంలో ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల జాబితాను ప్రత్యేకంగా రూపొందించారు. నలభై మంది ఎమ్మెల్యేలపై ఆయా నియోజకవర్గాలలో వ్యతిరేకత ఎక్కువగా ఉందనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. 
 
ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, పార్టీ సమన్వయ కమిటీ సమావేశాల్లోనూ, వర్క్‌షాపుల్లోనూ, ఇతర వేదికలపై కూడా పదేపదే చెబుతూ వచ్చారు. ఎమ్మెల్యేలకు సుద్దులు చెప్పారు. ఇప్పటికైనా మించిపోయింది లేదన్నారు. పనులు చేశామని చెప్పుకుంటే సరిపోదని, అధికార అహాన్ని తొలగించుకుని ప్రజలతో మమేకం అవ్వాలని చెప్పుకొచ్చారు చంద్రబాబు. వ్యవహారశైలిని మార్చుకున్నవారికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభిస్తుందని భరోసా కూడా ఇచ్చారు. అయినా కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహారశైలిలో ఎలాంటి మార్పు రాలేదని తేలింది. దీంతో ఆయన చర్యలకు సిద్ధమయ్యారు. 
 
ఎన్నికల సంవత్సరంలో అడుగుపెడుతున్న తరుణంలో ఇక ప్రతిరోజూ మధ్యాహ్నం నుంచి పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించనున్నారు. మధ్యాహ్నం వరకు సచివాలయంలో ఉండి పాలనా వ్యవహారాలు చక్కదిద్దుతారు. ఆ తర్వాత 4 గంటల నుంచి ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన సమావేశ మందిరంలో పార్టీ వ్యవహారాలు చూసుకుంటానని చంద్రబాబు పార్టీ నేతలకు చెప్పారు. 
 
ఇక ప్రతిరోజూ సాయంత్రం ఒక్కో నియోజకవర్గంపై దృష్టి సారించి.. ఎక్కడైతే పరిస్థితి దయనీయంగా ఉందో అక్కడి ఎమ్మెల్యేను భోజనానికి పిలిచి సాగనంపాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు ఎవరిని భోజనానికి ఇంటికి రమ్మంటారోననే ఆందోళన నెలకొంది.