శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By JSK
Last Modified: గురువారం, 24 నవంబరు 2016 (14:43 IST)

ప్రధాని ఒక్కమాట చెబితే అంతేనా? నోట్ల రద్దు చట్టబ‌ద్ధ‌మేనా? పార్ల‌మెంటు నిర్ణ‌యం అవ‌స‌రంలేదా?

న్యూఢిల్లీ : దేశంలో క‌రెన్సీని ర‌ద్దు చేస్తున్న‌ట్లు రాత్రికిరాత్రి ప్ర‌ధాని మోదీ చేసిన ప్ర‌క‌ట‌న తీవ్ర సంచ‌ల‌నం క‌లిగించింది. గ‌త 15 రోజులుగా ఆర్ధిక సంక్షోబానికి దారితీసింది. ఇలాంటి నిర్ణ‌యాన్ని ప్ర‌ధాని ఒక్క‌రే ప్ర‌క‌టించేయవ‌చ్చా? దీనికి పార్ల‌మెంట

న్యూఢిల్లీ : దేశంలో క‌రెన్సీని ర‌ద్దు చేస్తున్న‌ట్లు రాత్రికిరాత్రి ప్ర‌ధాని మోదీ చేసిన ప్ర‌క‌ట‌న తీవ్ర సంచ‌ల‌నం క‌లిగించింది. గ‌త 15 రోజులుగా ఆర్ధిక సంక్షోబానికి దారితీసింది. ఇలాంటి నిర్ణ‌యాన్ని ప్ర‌ధాని ఒక్క‌రే ప్ర‌క‌టించేయవ‌చ్చా? దీనికి పార్ల‌మెంటు నిర్ణ‌యంతో ప‌నిలేదా? అస‌లిది న్యాయ స‌మ్మ‌త‌మేనా? అనే వాద‌న ఇపుడు మొద‌లైంది.
 
నోట్లను రద్దు చేయాలంటే పార్లమెంటు నిర్ణయం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934లోని 26వ అధికరణానికి సవరణ చేయాలి. గ‌తంలో ప్రభుత్వం 1946లో ఆ అధికరణాన్ని సవరించి 26 (ఎ)ను చేర్చింది. 500, 1000, 10000 నోట్లను రద్దుపరిచింది. 1978లో కొన్ని డెనామినేషన్ నోట్లను మొత్తంగా రద్దు చేయవలసి వచ్చినప్పుడు, అప్పటి ప్రధాని మొరార్జి దేశాయ్, అధికరణ 26ను సవరించడానికి బదులుగా ఏకంగా ’హై డెనామినేషన్ బ్యాంక్ నోట్ (డిమానెటైజేషన్) యాక్ట్, 1978’ అన్న చట్టాన్నే చేశారు. అంటే ఇప్పుడు నవంబర్, 8న మోదీ చేసిన 500, 1000 నోట్ల రద్దు చర్యకు పార్లమెంటు ఆమోదం తెలపాలి, ఆర్.బి.ఐ. చట్టం అధికరణ 26ను సవరించాలి. ఈ సవరణ జరగలేదు. అంతేకాదు... సెంట్రల్ బోర్డ్ ఇవ్వవలసిన చట్టబద్ద సలహాను కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. 
 
500, 1000 నోట్లు చ‌ట్ట‌ స‌మ్మ‌తాన్ని కోల్పోయాయ‌న్న మోదీ
న‌వంబ‌రు 8 రాత్రి 8 గంట‌ల‌కు ప్ర‌ధాని మోదీ దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ‘ఈ అర్ధరాత్రి నుండి 500, 1000 రూపాయల నోట్లు చట్ట సమ్మతాన్ని కోల్పోతాయి. ఇది ప్రపంచంలో ఇప్పటివరకూ ఎవ్వరూ చేయని సాహసోపేత చర్య... అని ప్రధాని టి.వి.లలో వాగ్బాణాలను వదిలారు. ఆ నోట్ల మీద భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్.బి.ఐ.) గవర్నరు చేసిన వాగ్దానాన్ని ఒక్క మాట‌లో తుడిచిపెట్టారు. నోట్ల చట్ట సమ్మతాన్ని చట్టవిరుద్ధం చేయడం చట్ట సమ్మతమేనా? ఒక డెనామినేషన్ నోట్లను మొత్తంగా రద్దు చేసే అధికారం ప్రభుత్వానికుందా? అన్నది ప్రశ్న. 
 
ఆర్థిక శాఖ ఆదేశం: ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎస్.ఒ. 3408 (ఇ) తేదీ 08.11.2016 ప్రకటన ద్వారా ‘అమలులో ఉన్న రూ.500, రూ 1,000ల డెనామినేషన్ సీరీస్ బ్యాంకు నోట్లు చట్ట సమ్మతాన్ని కోల్పోతాయి‘ అని ప్రకటించింది. ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934’ లోని 26వ అధికరణ, 2వ ఉప అధికరణ ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి ఈ ఆదేశాలిచ్చినట్లు పేర్కొంది. డెనామినేషన్ సీరీస్ అన్న పద ప్రయోగంతో ఆర్ధిక‌శాఖ పప్పులో కాలేసింద‌ని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ప్రకటనలోని క్రమ సంఖ్య లేని మొదటి పేరా అసమగ్రంగా ఉంది. అంతేగాక ఇందులోని అంశాలను కాలక్రమేణా పలుమార్లు పత్రికా ముఖంగా సవరించారు. అయితే అమలులో ఆయా సంస్థలు ఈ ఆదేశాలను అపహాస్యం చేశాయి.
 
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934: కేంద్ర ప్రభుత్వం నుండి ద్రవ్య నిర్వహణను స్వాధీనపరుచుకోవడానికి, ఈ చట్ట నిబంధనల ప్రకారం బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగించడానికి ’రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అన్న పేరుతో ఒక బ్యాంకు ఏర్పాటు చేస్తున్న‌ట్లు అధికరణ 3(1) తెలుపుతుంది. రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డులో గవర్నర్, నలుగురికి మించని డెప్యూటి గవర్నర్లు, ప్రభుత్వం నియమించే 14 మంది డైరెక్టర్లు (4+10), ఒక ప్రభుత్వాధికారి ఉంటారని అధికరణ 8 (1) ప్రస్తావిస్తుంది. సెంట్రల్ బోర్డ్ సలహా మేరకు అది సూచించిన డెనామినేషన్ బ్యాంక్ నోట్లను ముద్రించవద్దని కాని, ఆపేయమని కాని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించవచ్చని అధికరణ 24 (1) చెపుతుంది. ఏ డెనామినేషన్ బ్యాంక్ నోట్లలోనైనా, ఏ సీరీస్ నైనా, సెంట్రల్ బోర్డ్ సిఫార్స్ మేరకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ద అమలును నిలుపుచేయవచ్చని అధికరణ 26 (2) వివరిస్తుంది. 13.01.1946కు ముందు జారీ చేసిన 500, 1000, 10,000 డెనామినేషన్ల నోట్లు చట్టబద్ద విలువ (లీగల్ టెండర్)ను కోల్పోతాయని, 1946లో సవరించిన, అధికరణ 26 (ఎ) ప్రకటించింది.
 
నోట్ల రద్దులో చట్ట నిర్లక్ష్యం: ప్రతి డెనామినేషన్‌లో అనేక సిరీస్ నోట్లు జారీ చేస్తారు. ఆ సిరీస్ నంబర్లు 5DR, 9BQ, 6VS, 9PH అని పలు సంఖ్యలలో ఉంటాయి. సిరీస్ నంబర్ ప్రతి నోట్ మీదా కింది భాగంలో ముద్రించి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డుకు ఒకటి లేదా కొన్ని సిరీస్ నోట్లను మాత్రమే రద్దు పరచమని సలహా చెప్పే హక్కుంది. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డు, కేంద్ర ప్రభుత్వ అధికారాలు పరిమితమే. అలాకాక మొత్తం డెనామినేషన్ నోట్లను రద్దు చేయాలంటే పార్లమెంటు నిర్ణయం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని 26వ అధికరణానికి సవరణ చేయాలి. ప్రభుత్వం 1946లో ఆ అధికరణాన్ని సవరించి 26 (ఎ)ను చేర్చింది. 500, 1000, 10000 నోట్లను రద్దుపరిచింది. 1978లో కొన్ని డెనామినేషన్ నోట్లను మొత్తంగా రద్దు చేయవలసి వచ్చినప్పుడు, అప్పటి ప్రధాని మొరార్జి దేశాయ్, అధికరణ 26 ను సవరించడానికి బదులుగా ఏకంగా ’హై డెనామినేషన్ బ్యాంక్ నోట్ (డిమానెటైజేషన్) యాక్ట్, 1978’ అన్న చట్టాన్నే చేశారు. అంటే ఇప్పుడు నవంబర్, 8 న 500, 1000 నోట్ల రద్దు చర్యకు పార్లమెంటు ఆమోదం తెలపాలి, ఆర్.బి.ఐ. చట్టం అధికరణ 26ను సవరించాలి. ఈ సవరణ జరగలేదు. ఇలా ఎన్నో అతిక్ర‌మ‌ణ‌ల మ‌ధ్య మోదీ నోట్ల ర‌ద్దును ప్ర‌క‌టించారు. దీనికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఉందా? అని న్యాయ నిపుణులు కొంద‌రు ప్రశ్నిస్తున్నారు.