బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : సోమవారం, 17 ఏప్రియల్ 2017 (09:04 IST)

దేవినేని నెహ్రూ రాజకీయ ప్రస్థానం... ఐదుసార్లు ఎమ్మెల్యే.. ఎన్టీఆర్ కేబినెట్‌లో విద్యామంత్రిగా...

కృష్ణా జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్రవేసిన మాజీ మంత్రి దేవినేని నెహ్రూ సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన.. చికిత్స కోసం వారం రో

కృష్ణా జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్రవేసిన మాజీ మంత్రి దేవినేని నెహ్రూ సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన.. చికిత్స కోసం వారం రోజుల క్రితం హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ వచ్చిన ఆయనకు సోమవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో హఠాన్మరణం చెందారు. ఈయన రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే... 
 
నెహ్రూ విద్యార్థిగా ఉన్న సమయంలో 1982లో యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (యూఎస్ఓ)ను నెహ్రూ ఏర్పాటు చేశారు. ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే ఈ సంస్థ ఒక బలమైన శక్తిగా ఎదిగింది. అయితే, విజయవాడలో దేవినేని నెహ్రూ, వంగవీటి రంగాల మధ్య జరిగిన వైరంలో.. నెహ్రూ సోదరుడిని ప్రత్యర్థులు హత్య చేశారు. ఆ తర్వాత 1983 టీడీపీ ఆవిర్భావం సందర్భంగా తెలుగుదేశంపార్టీలో దేవినేని చేరారు. 
 
అదే ఏడాదిలో కంకిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత 1985, 89లో ఇదే నియోజవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. 1994లో గెలుపొందిన తర్వాత ఆయన మొదటిసారిగా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎన్టీఆర్ హయాంలో ఉన్నత విద్యాశాఖమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1994, 2009లో ఎమ్మెల్యేగా నెహ్రూ ఎమ్మెల్యేగా గెలుపొందగా, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. 
 
ప్రధానంగా స్వర్గీయ ఎన్టీఆర్‌‌కు అత్యంత సన్నిహితుడు. ఎన్టీఆర్ చనిపోయినపుడు ఆయన పక్కనే దేవినేని నెహ్రూ ఉన్నారు. చివరివరకు ఎన్టీఆర్ మరణాంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ మారినప్పటికీ ఎన్టీఆరే తన దైవమని బహిరంగంగా చెప్పుకుంటూ వచ్చారు. 2004లో కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓడిపోయిన ఆయన 2009లో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. రాష్ట్ర విభజనాంతరం కాంగ్రెస్‌‌కు పార్టీకి జనాల్లో ఆదరణ లేకపోవడంతో ఆయన కాంగ్రెస్‌‌ పార్టీని వీడి టీడీపీలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది.