శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PY REDDY
Last Modified: శనివారం, 20 డిశెంబరు 2014 (05:25 IST)

గురుగ్రహం కింద సముద్రం..!! మరి ఇంకేం క్యూ కట్టేద్దాం.

మానవుడు ఎప్పటి నుంచో తమను పోలిన గ్రహాంతరవాసులు, భూమిని పోలిన గ్రహం కోసం  పరిశోధన చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలు చేస్తున్న శాస్త్రవేత్తలకు కొంచెం కొంచెం ఆధారాలు లభిస్తున్నాయి. అంగారకుడి భూగర్భంలో భారీ ఎత్తున సముద్రం ఉండవచ్చుననే భావనకు వచ్చేశారు. అంగారకుడి మీద ఒకప్పుడు నీరు ప్రవహించిన జాడలు కనిపిస్తున్నా... గ్రహం ఉపరితలంపై ఎక్కడా నీరు కనిపించలేదు. మరి ఆ నీళ్లన్నీ ఎక్కడికి వెళ్లినట్లు అనే సందేహాలు శాస్త్రవేత్తలను చాలా రోజులుగా పట్టి పీడిస్తున్నాయి. ఆ దిశగా అనే పరిశోధనలు చేసిన తరువాత వారు ఒక నిర్ధారణకు వచ్చారు. 
 
తాజాగా నాసా ఆధ్వర్యంలోని అంతర్జాతీయ అంతరిక్ష శాస్త్రవేత్తల బృందం.. భూమిపై పడిన పలు అంగారక ఉల్కాశకలాలను పరిశీలించింది. ఆ గ్రహంపై నీరు ఉందనేందుకు ఆధారాలను వాటిలో గుర్తించింది. ఉపరితలం నీరు లేకపోవడానికి వాతావరణంలోని మార్పులే కారణమని గ్రహించారు. ఈ నీరంతా అంగారకుడి ఉపరితలం కింద ద్రవ రూపంలోనో, మంచు రూపంలోనో ఉండవచ్చని భావిస్తోంది. అక్కడ జీవం ఉండే అవకాశం వంటి అంశాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుందని పరిశోధనకు నేతృత్వం వహించిన జపాన్ టోక్యో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్త తొమహిరొ ఉసయ్ తెలిపారు.
 
శకలాల్లో తాము గుర్తించిన నీటిలోని హైడ్రోజన్ ఐసోటోప్ అణువులు.. మార్స్ ఉపరితలంపై, వాతావరణంలో గుర్తించిన నీటిలోని హైడ్రోజన్ అణువులకన్నా భిన్నంగా ఉన్నాయని ఆయన చెప్పారు. నీటి పరిమాణాన్ని బట్టి అందులోని హైడ్రోజన్ ఐసోటోప్‌లుగా మారే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తాము ఉల్కా శకలాల్లో గుర్తించిన ఐసోటోపిక్ సిగ్నేచర్ ప్రకారం అంగారకుడి ఉపరితలం కింద భారీ స్థాయిలో నీళ్లు మంచు రూపంలో ఉండే అవకాశముందని ఆయన వెల్లడించారు. గ్రహాంతరాలు దాటలకునే మానవుని ఆశ నెరవేరుతుందని ఆశిద్దాం.