శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: మంగళవారం, 25 నవంబరు 2014 (15:55 IST)

నీటి జాడలు? : అబ్బుర పరుస్తున్న యూరోపా

ఎప్పుడో 18 ఏళ్ల కిందట గెలీలియో స్పేస్ క్రాఫ్ట్ తీసిన ఓ చిత్రాన్ని విశ్లేషించిన నాసా శాస్త్రవేత్తలకు అబ్బుర పరిచే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎక్కడో గురు గ్రహానికి ఉపగ్రహంగా ఉన్న యూరోపా ఉపరితలాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు అక్కడ నీటి జాడలు ఉన్నాయనే విషయాన్ని పరోక్షంగా చెబుతున్నారు. 

 
ఇంతకీ వివరాలేంటంటే... అంతరిక్ష పరిశోధనలో నాసా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను చెబుతూనే ఉంటుంది. 1996లో గెలీలియో స్పేస్ క్రాఫ్ట్ గురుగ్రహానికి ఉపగ్రహంగా ఉన్న యూరోపా ఫోటో తీసింది. వాస్తవానికి యూరోపా 1610 లోనే కనుగొన్నారు. అయితే దాని చిత్రాన్ని మాత్రం 1996లో తీశారు. ఆ చిత్రాన్ని ఆధునిక చిత్ర సాంకేతిక విజ్ఞానముతో మరింత లోతుగా పరిశీలించి రంగులు అద్దారు. 
 
మానవుని కంటితో చూస్తే ఎలా ఉంటుందో అలా తయారు చేశారు. అంతే అబ్బురపరిచే మరిన్ని విశేషాలు బయటపడ్డాయి. ఉపరితలంపై నీలం, తెల్లని చారలు కనిపిస్తున్నాయి. ఇవి ఉపరితలంపై కప్పిన మంచు, నీటిని పోలినవిగా చెబుతున్నారు. అదేసమయంలో ఎర్రగానూ, మట్టి రంగులోను ఉండే భాగాన్ని సాధారణం భాగంగా పోల్చుతున్నారు.
 
రంగుల తేడా కనిపించడానికి రెండు రకాల మంచే కారణమవుతుందని చెపుతున్నారు. ఉపరితలంపై పొడవైన చారలు కనిపిస్తున్నాయి. అవన్నీ మట్టి రంగు ఉన్నాయి. ఇవి ఉపరితలంపై ఉన్న చీలికలుగా చెబుతున్నారు. ఆ చీలికల ప్రాంతంలో మంచుపొరలు విడిపోయిన కారణంగా అలా చారలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇలా యూరోపాపై భూమిని పోలిన వాతావరణం ఉండవచ్చునని పరోక్షంగా భావిస్తున్నారు. గురుగ్రహం చుట్టూ మూడు ఉప గ్రహాలున్నాయి. యూరోపా రెండో పరిమాణంలో ఉన్న ఉపగ్రహం.