Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తిరుపతికి మొండిచేయి చూపించిన విత్తమంత్రి అరుణ్ జైట్లీ

గురువారం, 2 ఫిబ్రవరి 2017 (14:48 IST)

Widgets Magazine
Lord Venkateswara

ప్రముఖ ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమల. ప్రతిరోజు 50 నుంచి 70వేల మందికిపైగా భక్తులు తిరుపతికి వస్తూ వెళుతూ ఉంటారు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తుల తాకిడితో తిరుపతి ఎప్పుడూ కిటకిటలాడుతుంటుంది. అలాంటి తిరుపతిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు ఉంది. అయితే తిరుపతిని అభివృద్ధి చేయడంలో ఎప్పుడూ ప్రభుత్వాలు వెనుకడుగు వేస్తుంటాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. 
 
పార్లమెంటులో బుధవారం కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తిరుపతికి ఆశించిన మేరకు న్యాయం జరుగుతుందని భావించారు. అయితే బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జరిగింది. తిరుపతికే కాదు... విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కేంద్రం తీవ్ర అన్యాయం చేసింది. కేవలం ఏపీలో అమరావతి రాజధాని భూములకు కేటాయించిన రైతులకు పన్ను రాయితీలను ఇచ్చింది కానీ ఎన్నో సమస్యలున్న ఏపీని గాలికొదిలేసిందన్న విమర్శలు లేకపోలేదు.
 
తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్‌గా ప్రకటించాలని, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న డిమాండ్‌తో పాటు తిరుపతిని సుందరీకరణ చేయడానికి ఎంతో నిధులు అవసరం. అలాగే విశాఖను రైల్వేజోన్ చేయాలన్న డిమాండ్ కూడా ఎప్పటి నుంచో ఉంది. తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్ చేయాలన్న డిమాండ్‌ 12 సంవత్సరాల క్రితం మాట. లాలూప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వేశాఖామంత్రిగా ఉన్న సమయంలో తిరుపతిని అంతర్జాతీయ రైల్వేస్టేషన్‌గా తీర్చిదిద్దుతానని, 2 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తానని ప్రకటించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైల్వేస్టేషన్‌‌ను అభివృద్ధి చేసిన పాపాన పోలేదు. 
 
ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడుగా ఉన్న సురేష్‌ ప్రభు రైల్వే మంత్రిగా ఉన్నారు. ఈయన ఏదేదో చేస్తారనీ, ఇచ్చేస్తారని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ తిరుపతికే కాదు.. ఏపీకి చేసింది శూన్యమనే చెప్పాలి. సురేష్‌ ప్రభు తిరుపతిలో రెండు, మూడు సార్లు పర్యటించారు. చిత్తూరు జిల్లా తొట్టంబేడులో క్యారేజ్ రిపేర్ షాపు నిర్మాణం చేస్తానని, తిరుపతి రైల్వేస్టేషన్‌ను అన్ని విధాలుగా అభివద్ధి చేస్తానని చెప్పాడు. కానీ అంతా మాటలకే పరిమితమైంది తప్ప చేతల్లో సాధ్యం కాదు. పైగా రెండు బడ్జెట్‌లు ఒకేసారి కావడం (ఆర్థిక బడ్జెట్, రైల్వేబడ్జెట్ ) రెండూ ఒకేసారి ప్రవేశపెట్టడంతో గందరగోళం నెలకొంది.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శశికళ వర్సెస్ పన్నీర్ సెల్వం.. అమ్మ స్మారకమండపం శంకుస్థాపన జరిగేనా?

అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు వెలుగులోకి వస్తోంది. ప్రస్తుతం దివంగత ముఖ్యమంత్రి జయలలిత ...

news

డోనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్స్ దెబ్బకు అమెరికా ఆర్థికవ్యవస్థ మటాష్

అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఇమ్మిగ్రేషన్ ఆర్డర్స్ దెబ్బకు ఆ దేశ ...

news

అనంతలో పయ్యావుల కేశవ్ అనుచరులు ఎంత పని చేశారో తెలుసా?

అనంతపురం జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల ఆగడాలు, అరాచకాలు అంతకంతకూ ...

news

ప్రేమను తిరస్కరించిందనీ.. అందరూ చూస్తుండగానే వైద్య విద్యార్థినిపై పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు!

కేరళలోని కొట్టాయంలో ఘోరం జరిగింది. అందరూ చూస్తుండగానే 20 ఏళ్ల వైద్య విద్యార్థినిపై ...

Widgets Magazine