శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PY REDDY
Last Updated : ఆదివారం, 28 డిశెంబరు 2014 (17:27 IST)

అమ్మో విమాన ప్ర‌యాణ‌మా...! ఇప్పటి వరకూ 84 విమానాలు అదృశ్యం..!!

భూమి మీద దారి త‌ప్పిపోతే.. ఏదోక తోవ ప‌ట్టుకుని జ‌నం ఉన్న చోటుకి చేరిపోవ‌చ్చు. నీటి దారి త‌ప్పిపోతే ఏదో ఒక ఒడ్డుకు చేరుకోవ‌చ్చు. మ‌రి గాలిలో అదృశ్య‌మైతే ఎక్క‌డికి చేరుకోవాలి? ఎక్క‌డున్నామో.. ఎన్న‌టికి క‌లుసుకుంటామో... ఎక్క‌డికి చేరుకుంటామో కూడా అంతుబ‌ట్ట‌ని విష‌యం స‌రిగ్గా విమాన ప్ర‌యాణికులు ఈ భయం వెంటాడుతోంది. అదృశ్య‌మ‌వుతున్న విమానాల సంఘ‌ట‌న‌లు జ‌నాన్ని భ‌య‌కంపితుల‌ను చేస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌పంచంలో 84 విమానాలు ఆచూకీ లేకుండా పోయాయని అంచనా. మొదట 1856లో తొలి సారి బెలూన్ విమానం కనిపించకుండా పోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకూ విమానాల తయారీలో ఎంత ఆధునిక పోకడలు వస్తున్నా ఫలితం లేదు. ప్రపంచంలో ఏదోక మూల విమానాలు మాయమవడమనేది జరగుతూనే ఉంది. 
 














1923 డిసెంబర్ 21న తొలిసారిగా సహారా ఎడారిని దాటుతున్న విమానం ఆచూకీ గల్లంతయ్యింది. గల్ఫ్ కు బయలుదేరిన విమానం మిస్సయింది. చాలా కాలం దీని వివరాలు తెలియలేదు. ఇందులో 49 ప్రయాణికులు ఉన్నారు. దీనికి ముందు తరవాత కూడా విమానాల గల్లంతు జరుగుతూనే ఉంది. అయితే ప్రతీ విమానంలో కూడాఒకరూ ఇద్దరూ ప్రయాణికులు ఉండనే ఉన్నారు. తరువాత 1938లో 15 ప్రయాణికులతో ఉన్న విమానం ఒకటి  అదృశ్యం అయ్యింది. 1944లో 24 మందితో ఉన్న మిలటరీ విమానం ఒకటి న్యూ అట్లాంటిక్ లో కనిపించకుండా పోయింది. మళ్లీ మరో 25 మంది చొప్పున కలిగి ఉన్న మిలటరీ విమానాలు ఆచూకీ ఇప్పటి వరకూ తెలియకుండా పోయింది. 1948 జనవరి 30, ఆగస్టు 1 వరుసగా 31, 52  ప్రయాణిలకుతో కూడిన విమానాలు పెద్ద మిస్సింగులగా చెప్పవచ్చు. 
 
వీటిని బర్మిడీ మిస్టరీ మింగేసినట్లు చెబుతారు. అదే యేడాది డిసెంబర్లో ఫ్లోరిడాలో 32 మందితో కూడిన విమానం కనిపించకుండా పోయింది. 1949 నుంచి 52 వరకూ ప్రతీ ఏడు విమానాల మిస్సింగ్ జరుగుతూనే వచ్చింది. 1957లో 67 మందితో కూడిన విమానం అదృశ్యమయ్యింది. ఇదే పరంపర ఆ తరువాత కూడా కొనసాగింది. 1962లో 107 మందితో కూడిన మిలటరీ విమానం పసిఫిక్ మహాసముద్రంపై కనిపించకుండా పోయింది. 1989లో హిమాలయ పర్వతాలలో 54 మందితో కూడిన విమానం మిస్సయ్యింది. ఇవి పెద్ద మిస్సింగులైతే ఆ తరువాత 2014లో జరిగిన మలేషియా విమాన మిస్పింగే పెద్దదిగా చెప్పవచ్చు. మధ్య మధ్యలో ఏదోక దేశం పదిమంది, ఇరవైమంది ఉన్న విమానాలు మిస్సవుతూనే ఉన్నాయి. ఇందులో సైనిక విమానాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 
 
మాన‌వుడు మ‌రో గ్రహం మీద అడుగు పెట్టేందుకు త‌హ త‌హలాడుతున్న ఈ రోజుల్లో కూడా విమాన అదృశ్యాలు వారిని వెంటాడుతున్నాయి. ఓ విమానం అదృశ్యమైంది... దాని జాడ ఇప్పటికి తెలియలేదు. మరో విమానం తాజాగా అదృశ్య‌మ‌య్యింది. ఆదివారం ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానం క్యూజెడ్ 8501 గగనతలం నుంచి అదృశ్యమైంది. సురబయా నుంచి సింగపూర్ బయలుదేరిన ఈ విమానం కొద్ది సేపటికే  విమానాశ్రయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయని ఇండొనేసియా మీడియా ప్రకటించింది. ఈ అదృశ్యమైన విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలపి 162 మంది ఉన్నట్లు సమాచారం. ఇది కూలిపోయి కూడా ఉండవచ్చునని భావిస్తున్నారు. ఏది ఏమైనా దీనిని ఎప్పటికీ ఛేదించగలుగుతారో వేచి చూడాల్సిందే.