బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (06:49 IST)

జగన్ ను తిడితే చాలు.. ఏదోక పదవి ఖాయం అందుకే ఎమ్మెల్సీలు

తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీ కొట్టేయాలంటే ఒక్కటే ఉండాలి. చాటంత నోరేసుకుని ప్రతిపక్షాలను తిడితే చాలు.. అందునా జగన్ ను బండబూతులు తిడితే వారికి వందశాతం మార్కులు వచ్చేసినట్లే. వారు ఓడిపోయినా పర్వాలేదు. నేరుగా పెద్దల సభలో కూర్చుని ఎమ్మెల్యేలకు మించి అధికారాన్ని అనుభవించవచ్చు. సరిగ్గా ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థుల తీరు అదే అర్థానిస్తుంది. వారికి పదవి కట్టబెడితే మరింత జోరుగా తిడతారని చంద్రబాబు ఆలోచించినట్లున్నారు. వారికే ఎమ్మెల్సీ పదవులను కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. 
 
పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు, పంచుమర్తి అనూరాధ..ఈ పేర్లన్నీ నిత్యం మీడియా నలిగే పేర్లే. వర్ల రామయ్య. ఆయనకు మాత్రం పాపం ఈ సారి చాన్స్ రాలేదు. కానీ బాధపడక్కరలేదు. ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ గిరీ దక్కింది. మరొకరు వున్నారు.  మళ్లీ ఆయన పేరు కొన్ని మీడియాల్లో కనిపించలేదు. ఆయన కూడా ఈ కేటగిరీనే. వైవిబీ రాజేంద్ర ప్రసాద్ కూడా ఎంపికయ్యారని తొలుత వార్తలు వచ్చాయి. ఇక జూపూడి ప్రభాకరరావు కూడా వైకాపాలో వున్నపుడు ఇదే తరహా కార్యక్రమం అక్కడ నిర్వహించేవారు. ఇలాగే తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును కడిగేసిన వారు. కాకపోతే ఇప్పుడు తేదేపాలోకి వచ్చారు. 
 
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే వీర తిట్టుడుగాళ్ళేవరు? జూనియర్ తిట్టుగాళ్ళెవరని ప్రామానికాన్ని తీసుకున్నారు. మిగిలిన వారికి ఇప్పుడు సంకేతాలు స్పష్టమయ్యాయి. జిల్లాల్లో కూర్చుంటే కాదు. హైదరాబాద్ లో కూర్చోవాలి. నిత్యం ఏదో పాయింట్ పట్టుకుని జగన్ ను బండ తిట్లు తిట్టాలి. భూగోళంపై ఎక్కడ ఏమీ జరిగినా జగన్ కు ముడిపెట్టే చాకచక్యం వుండాలి. అప్పుడు తెలుగుదేశంలో పదవులు పరుగెతుకుంటూ వచ్చేస్తాయన్నమాట.