శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2016 (12:34 IST)

ఎవరికైనా ఉన్నఫళంగా రూ.12 కోట్లు వస్తే ఏం చేస్తారూ...? పి.వి సింధు, సాక్షి మాలిక్ ఇంకేమీ సాధించలేరా...?

రియో ఒలింపిక్ క్రీడల్లో మన ఆడబిడ్డలు రెండు పతకాలను సాధించుకువచ్చారని సంబరాలు చేసుకోవడమే కాదు, కోట్లకు కోట్ల డబ్బు వరద వారిపై వరదలా ప్రవహింపజేస్తున్నాయి ఆయా ప్రభుత్వాలు, సంస్థలు. ఇప్పుడిదే పెద్ద చర్చనీ

రియో ఒలింపిక్ క్రీడల్లో మన ఆడబిడ్డలు రెండు పతకాలను సాధించుకువచ్చారని సంబరాలు చేసుకోవడమే కాదు, కోట్లకు కోట్ల డబ్బు వరద వారిపై వరదలా ప్రవహింపజేస్తున్నాయి ఆయా ప్రభుత్వాలు, సంస్థలు. ఇప్పుడిదే పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. కేరళ సినీ డైరెక్టర్ అయితే సింధు విజయంపై ఉమ్మి వేస్తానంటూ వివాదాస్పద కామెంట్ చేశాడు. 
 
బ్రిటన్ జర్నలిస్టు అయితే, గెలవలేని ఇండియా పిచ్చిపిచ్చిగా సంబరాలు చేసుకుంటోంది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక దీనిపై ఇప్పుడు సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఇదిలావుంటే... పి.వి సింధు, సాక్షి మాలిక్ పతకాలు సాధిస్తే వారికి ఇలా కోటాను కోట్ల నగదు బహుమతి కరెక్టేనా అనే చర్చ కూడా నడుస్తోంది. 
 
ఎవరికైనా ఉన్నఫళంగా రూ. 12 కోట్లు వస్తే ఏం చేస్తారూ...? అనే ప్రశ్నలు, దానిపై చర్చలు కూడా జరిగిపోతున్నాయి. డబ్బు వచ్చింది కనుక ఆ డబ్బుతో చక్కగా ఏదైనా వ్యాపారం చేసుకుని హాయిగా కాలం గడిపేస్తారు. అదేమీ చిన్నమొత్తం కాదు కదా. జీవితంలో ఇంత నగదు వచ్చినప్పుడు ఇంక చేయాల్సిందేముంటుంది... సాధించాల్సిందేముంటుంది. ఇప్పుడు ఇదే పి.వి సింధు, సాక్షి మాలిక్, దీపా కెరీర్‌లకు పెద్ద అడ్డంకిగా మారుతుందనే వాదనలు వస్తున్నాయి. వారికి భారీ నగదుతో పాటు బ్రాండ్ అంబాసిడర్ పోస్టులు, ఇళ్ల స్థలాలు, ఉద్యోగాలు... ఇంకా ఎన్నెన్నో నజరానాలు. ఇక వాళ్లు కష్టపడి ఆడాల్సిన అవసరం ఉంటుందా...? అసలు ఆడుతారా...? భారతదేశానికి వీళ్లు స్వర్ణ పతకాలు తేగలరా...? ఇలా ప్రశ్నలపై ప్రశ్నలు ఆయా మాధ్యమాల్లో దూసుకు వస్తున్నాయి. మరి ఈ చర్చ ఎంతవరకు వెళుతుందో వెయిట్ అండ్ సీ.