Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జనసేనలోకి టాలీవుడ్ హీరో.. ఎంపీగా పోటీ!

మంగళవారం, 27 జూన్ 2017 (14:57 IST)

Widgets Magazine
sivaji

శివాజీ. మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లలో నటిస్తూ ఒక్కసారిగా హీరోగా అవకాశం దక్కించుకున్న వ్యక్తి. మెగాస్టార్ చిరంజీవి అంటే శివాజీకి ప్రాణం. ముందు నుంచీ అన్నయ్య సినిమాలో నటించాలంటే ఎంతో ఇష్టం. అలాంటి అవకాశం చాలాసార్లు శివాజీకి వచ్చింది. అయితే ఆ తర్వాత సినిమాల గురించి పెద్దగా పట్టించుకోని శివాజీ సమాజంలో జరుగుతున్న సంఘటనపై దృష్టి పెట్టారు. ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. రకారకాల ఆందోళనలతో శివాజీ ముందుకెళ్ళారు. అయితే ఏ మాత్రం ఫలితం లేకుండా పోయింది గానీ శివాజీకి మాత్రం మంచి పేరే వచ్చింది. ఒక ఉద్యమంలా ప్రత్యేక హోదాను తీసుకెళ్ళడంతో జనంలో శివాజీకి ఒక గుర్తింపు వచ్చింది.
 
ఆ తర్వాత శివాజీ ఏదో ఒక రాజకీయపార్టీలోకి వస్తారనుకుని అందరూ భావించారు. అయితే ఉన్న రాజకీయ పార్టీల కన్నా కొత్తగా వచ్చే రాజకీయ పార్టీలవైపు వెళ్ళాలన్నది శివాజీ ఆలోచన. అందుకే శివాజీ జనసేన వైపు దృష్టి సారించారు. పవన్ కళ్యాణ్‌‌తో ఇప్పటికే శివాజీకి మంచి రాపో ఉంది. ఇద్దరు మంచి స్నేహితులు. శివాజీ గతంలో ఆందోళన చేసేటప్పుడు పవన్ స్వయంగా అభినందించారు. 
 
అయితే అప్పట్లో జనసేన పార్టీ పూర్తిస్థాయిలో లేకపోవడంతో శివాజీ సైలెంట్‌గా ఉన్నారు. అయితే ఆ తర్వాత జనసేన పార్టీలోకి కొత్త రక్తం వెళుతుండటంతో శివాజీ వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. నేరుగా ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్‌కే చెప్పారట శివాజీ. శివాజీ లాంటి వ్యక్తి తన పార్టీలోకి వస్తే పవన్ కాదంటారా. ఎప్పుడైనా మీరు రావచ్చు అని చెప్పారట పవన్. అది కూడా ఎంపి స్థానానికే పోటీ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాడట పవన్. మొత్తం మీద వీరిద్దరు కలిస్తే ప్రజలు బాగా ఆదరిస్తారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రసాయన దాడి చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు : ఉ.కొరియాకు అమెరికా వార్నింగ్

ఉత్తర కొరియాకు అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ దఫా రసాయనదాడి చేస్తే భారీ మూల్యం ...

news

జూకు వచ్చిన గర్భవతిని ఆప్యాయత పలకరించిన పెద్దపులి.. కడుపులోని బిడ్డను?

క్రూర మృగాలంటేనే ఆమడ దూరం పారిపోతాం. అలాంటిది.. ఓ గర్భం ధరించిన మహిళ రాయల్ బెంగాల్ ...

news

శిరీష - రాజీవ్‌లు కలిసుండటం చూశా.. ఇపుడు అసహ్యం వేస్తోంది : తేజశ్విని

బ్యూటీషియన్ శిరీష, రాజీవ్‌లు కలిసుండటాన్ని తాను కళ్లారా చూశానని, కానీ రాజీవ్‌పై ఉన్న ...

news

ట్రంప్‌ పాలనతో హ్యాపీగా లేము.. అమెరికన్లకు ఇదో మేలుకొలుపు: అన్సెల్

హాలీవుడ్ నటుడు అన్సెల్ ఎల్టోర్ట్.. అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు ...

Widgets Magazine