శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By JSK
Last Modified: శనివారం, 2 జులై 2016 (14:41 IST)

అందుకే ఫిన్లాండ్ వర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్... మనలా రెండున్నరేళ్లకే పిల్లకు టార్చర్ లేదక్కడ... మరెలా...?

ఫిన్‌ల్యాండ్ అనేది ప్ర‌పంచప‌టంలో ఓ చిన్న దేశం. కానీ, విద్యా రంగంలో ప్ర‌పంచంలోనే ఫిన్లాండ్ నెంబ‌ర్ వ‌న్. ఇక్క‌డ నూరుశాతం అక్ష‌రాస్య‌తే కాదు.. పిల్లలు చ‌దువులో ఘ‌నాపాటీలు. ఎందుకంటే... ఇక్క‌డ విద్యావిధాన‌మే డిఫెరంట్. అందులోని ముఖ్యాంశాలివి.

ఫిన్‌ల్యాండ్ అనేది ప్ర‌పంచప‌టంలో ఓ చిన్న దేశం. కానీ, విద్యా రంగంలో ప్ర‌పంచంలోనే ఫిన్లాండ్ నెంబ‌ర్ వ‌న్. ఇక్క‌డ నూరుశాతం అక్ష‌రాస్య‌తే కాదు.. పిల్లలు చ‌దువులో ఘ‌నాపాటీలు. ఎందుకంటే... ఇక్క‌డ విద్యావిధాన‌మే డిఫెరంట్. అందులోని  ముఖ్యాంశాలివి.
• ఏడు ఏళ్ళు నిండాక పిల్లలు స్కూల్లో చేరుతారు. మ‌న‌లాగా రెండున్న‌రేళ్ళ‌కే పిల్లలకు చ‌దువు టార్చర్ మొదలవదు.
• చిన్నప్పటి నుంచి తన ప్రతి కదలిక నుండి పిల్లలు నేర్చుకొంటూనే ఉంటారు.
• ఏడో సంవత్సరం నుండి 10వ సంవత్సరం వరకు 50% స్కూల్లోను 50% సెలవుల్లోను గడుపుతారు.
• స్కూల్ టైమింగ్ తక్కువ. సంగీతం, కళలు, ఆటలకు సమాన ప్రాధాన్యం ఉంటుంది.
• స్కూళ్ళ‌లో విద్యార్థులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు విశ్రాంతి తీసుకొనేందుకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేశారు. 
 
• 13 సంవత్సరాల వరకు విద్యార్థులకు గ్రేడింగ్, ప్రోగ్రెస్ రిపోర్ట్‌ల గొడవే లేదు. కాబట్టి విద్యార్థుల మీద పోటీ పడాలనే ఒత్తిడి ఉండదు.
• తల్లితండ్రులకు తమ పిల్లల ప్రోగ్రెస్ తెలుసుకోవాలనే కోరిక ఉంటే, దరఖాస్తు చేసుకోవచ్చు.
• హోంవ‌ర్క్ ఇవ్వరు. తమకు నచ్చిన సబ్జెక్టులో వారు హోం వ‌ర్క్ చేసుకోవచ్చు.
• ప్రతి స్కూల్లో ఒక డాక్టర్ నివసిస్తాడు. విద్యార్థుల ఆరోగ్యం గురించి సలహాలు ఇస్తాడు.
• ఒక స్కూల్లో 600 మించి విద్యార్థులను అనుమతించరు.
 
• ఫిన్‌ల్యాండ్‌లో ప్రైవేటు స్కూల్లుండవు. అన్నీ ప్రభుత్వ స్కూళ్ళే. విద్య విషయంలో నాణ్యతను ఖచ్చితంగా పాటిస్తారు.
• ఫిన్లాండ్‌లో 99% విద్యార్థులు ప్రాథమిక విద్య తప్పక అభ్యసిస్తారు.
• పరీక్షలు నిర్వహించని దేశాల నుండి వచ్చిన విద్యార్థుల్లో పోటీలలో బాగా రాణించే గుణం ఉంటుంది.
• ఇది ఎలా సాధ్యం? ఐక్యరాజ్యసమితి ఈ విషయంగా పరిశోధించింది.
• ప్రపంచంలోని విద్యార్థులందరిలోకి ఫిన్లాండ్ దేశ విద్యార్థులే చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విషయంగా ఫిన్లాండ్ ప్రథమ స్థానం.
 
• ఫిన్లాండ్ విద్యావ్యవస్థ గురించి తెలుసుకొనేందుకు ప్రపంచంలోని అన్నిదేశాల విద్యావేత్తలు అక్కడకి క్యూ కట్టారు.
• 56 దేశాల నుండి 1500 మంది ప్రతి సంవత్సరం ఫిన్లాండ్‌కు వెళుతున్నారు.
• అధిక మొత్తం విదేశీ మారకం విద్యారంగ పర్యాటకుల నుండే వస్తుంది.
• ఫిన్లాండ్‌లో టీచర్ ఉద్యోగం అంటే ఇక్కడి ఐఏఎస్, ఐపిఎస్‌తో సమానం.
 
• ఫిన్లాండ్‌లో చట్టాలు, విధానాల రూపకల్పనలో ప్రధాన పాత్ర “ఉపాధ్యాయులదే”
• ఫిన్‌ల్యాండ్ దేశంలోని ప్రతి మూడో విద్యార్ధి ఉపాధ్యాయుడు కావాలనుకొంటాడు. కానీ అదంత సులభం కాదు.
• విద్యలో బాగా రాణించేవారికే ఆ అవకాశం ఉంటుంది.
• వారికి 5సంవత్సరాల ఉపాధ్యాయ శిక్షణ, 6 నెలలు సైన్యంలోను, ఒక సంవ‌త్స‌రం స్కూల్లో ట్రైనింగ్ ఉంటుంది. చట్టాలు, విధానాల రూపకల్పన, స్వయం రక్షణ, ప్రథమ చికిత్స, అగ్నిమాపక దళంలోను 6 నెలల పాటు శిక్షణ. మొత్తం ఏడు సంవ‌త్స‌రాల‌ శిక్షణ ఉంటుంది.