గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 అక్టోబరు 2014 (13:54 IST)

హైదరాబాద్‌లో రేవ్ పార్టీల కల్చర్: ఎన్నిసార్లు దాడిచేసినా నో యూజ్!

హైదరాబాద్‌లో రేవ్ పార్టీల కల్చర్ సాగుతోంది. ఎన్నిసార్లు పోలీసులు దాడులు చేస్తున్నా, ఈ సంస్కృతి పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. యువత లో ఉండే బలహీనతల ఆధారంగా ఇలాంటివి జరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. 
 
ప్రత్యేకించి నగర శివారాలలో ఈ రేవ్ పార్టీలు జరుగుతున్నాయి. మేడ్చల్ శివారులో జరుగుతున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడిచేశారు. ఆ సమయంలో పారిపోవడానికి ప్రయత్నించగా పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.