గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (13:25 IST)

రోజాది ఐరన్ లెగ్... పార్టీలోకి వద్దనే వద్దన్న తెలుగు తమ్ముళ్లు.. వెనక్కి తగ్గిన వైకాపా ఎమ్మెల్యే

సినీనటి రోజా పార్టీ మారడం ఇప్పట్లో లేదని దాదాపు ఖాయమైపోయింది. రెండునెలలకు ముందు ఒక్కసారిగా పార్టీ మారడానికి సిద్ధమైన రోజా చివరకు తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీలోకి రానివ్వకపోవడంతో వెంటనే తన నిర్ణయాన

సినీనటి రోజా పార్టీ మారడం ఇప్పట్లో లేదని దాదాపు ఖాయమైపోయింది. రెండునెలలకు ముందు ఒక్కసారిగా పార్టీ మారడానికి సిద్ధమైన రోజా చివరకు తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీలోకి రానివ్వకపోవడంతో వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పుడెలా ఉన్నా ఆ తర్వాత కొన్నిరోజులకు తిరిగి చేరాలని నిర్ణయించుకున్నా ఫలితం లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం మాత్రం రోజా పార్టీలోకి వెళ్ళలేదనేది స్పష్టంగా అర్థమైపోయింది. ఇదే విషయంపై తన సన్నిహితులు, పార్టీ కార్యకర్తలతో ఆమె రహస్యంగా సమావేశమయ్యారు. తెలుగుదేశంపార్టీలోకి వెళ్ళకూడదని.. ఇక నుంచి చంద్రబాబు, టిడిపి మంత్రులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారట.
 
సినీనటి రోజా, ప్రస్తుతం నగరి ఎమ్మెల్యేగా ప్రస్తుతం కొనసాగుతున్న ఈమె వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీలో ఫైర్‌బ్రాండ్‌గా ఉన్నారు. పార్టీ మారిన తర్వాత వైఎస్‌ఆర్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న రోజా ఆ తర్వాత కొన్నిరోజులకు పార్టీకి, నాయకులకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎందుకంటే తనకు పార్టీలో సముచిత స్థానం కలిగించడం లేదని, నేతలు చిన్నచూపు చూస్తున్నారని మనస్థాపంతో రోజా కొన్నిరోజుల పాటు అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ వచ్చారు.
 
ఒకానొకదశలో ఒక టీవీ ఛానల్‌ కార్యక్రమంలో యాంకర్‌గా బిజీ ఉండటమే కాకుండా మరికొన్ని టీవీ ఛానల్‌లో యాంకర్‌గా కొనసాగుతూ అందులోనే బిజీగా గడిపారు. కనీసం పార్టీ మారదామని నిర్ణయించుకున్నా అవతలి పార్టీ వారు ఈమె రాకను ఒప్పుకోకపోవడంతో ఇక చేసేది లేదు నిశ్శబ్దంగా ఉండి పోయారు. అంతేకాదు పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా పెద్దగా హాజరుకాలేదు. ఒకరోజు ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. అదికూడా ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడంతో రోజా పార్టీ మారడం దాదాపు ఖాయమనుకున్నారు.
 
అంతేకాదు ఇక వైఎస్‌ఆర్‌ పార్టీకి బ్యాండ్‌ పగిలినట్లే అనుకున్నారు. చివరకు రోజా వెళ్ళడానికి సిద్ధమైనా వారు ఏ మాత్రం ఒప్పుకోలేదు. అధినేత బాబునై ఒత్తిడి తెచ్చారు. ఐరన్‌లెగ్‌గా పేరున్న రోజా మళ్ళీ పార్టీలోకి వస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించడంతో ఇక చేసేది లేక అధినేత కూడా సైలెంట్‌ అయిపోయారు. అలా రోజా పార్టీ మారడం ఆలస్యమవ్వడం అవుతుందని అనుకుంటే. చివరకు మాత్రం పార్టీ వెళ్ళకూడదని నిర్ణయం తీసేసుకున్నారట రోజా.
 
తాను ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తున్న నగరిలో రెండురోజుల క్రితం జరిగిన జాతరలో పాల్గొన్న రోజా తన అనుచరులు, సన్నిహితులతో రహస్యంగా సమావేశమయ్యారట. ఎట్టి పరిస్థితుల్లోను పార్టీ మారకూడదని, అవసరమైతే తర్వాత చూసుకుందామని వారికి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైసిపిలో తనకు ప్రశాంతంగానే ఉందని, పార్టీ నాయకులు కూడా కలిసిపోయారని, ఇంకెందుకు పార్టీమారాలని తన అనుచరులనే ప్రశ్నించారట రోజా. మొత్తంమీద రోజా పార్టీ మారడం ఇప్పట్లో లేదని ఆమె అనుచరులే బహిరంగంగా చెప్పుకుంటున్నారు.