శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By tj
Last Updated : శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (21:09 IST)

తమిళనాడులోకి ఆలస్యంగా బీజేపీ..! అభాసుపాలవ్వడం ఖాయమా?

చిత్ర విచిత్రంగా మారిన తమిళ రాజకీయాలు. కేంద్రం పాచికలు పారే అవకాశాలు ఉన్నాయా? చక్రం తిప్పాలనుకున్నప్పుడు ముందే ఎంటరవ్వాలి. కథ క్లైమాక్స్‌కు చేరిన తర్వాత క్లైమాక్స్ మార్చమంటే సాధ్యమవుతుందా? పన్నీరు సెల

చిత్ర విచిత్రంగా మారిన తమిళ రాజకీయాలు. కేంద్రం పాచికలు పారే అవకాశాలు ఉన్నాయా? చక్రం తిప్పాలనుకున్నప్పుడు ముందే ఎంటరవ్వాలి. కథ క్లైమాక్స్‌కు చేరిన తర్వాత క్లైమాక్స్ మార్చమంటే సాధ్యమవుతుందా? పన్నీరు సెల్వంను నమ్ముకున్న బీజేపీ అభాసుపాలు కావడం తప్ప సాధించేది ఏమీ లేదన్న విషయం ఇప్పటికే అర్థమౌతోంది. జాతీయ పార్టీలకు చాలా కాలం నుంచి ఒక గుబులు మొదలైంది. 
 
రోజు రోజుకూ పెరుగుతున్న ప్రాంతీయ పార్టీల హవాను చూసి బయపడిపోతున్నాయి. అందుకే అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రాంతీయ పార్టీలకు తమలో కలుపుకోవడమా లేక వాటిని విడగొట్టమో చేస్తూ వస్తున్నాయి. అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ కూడా అదే పని చేయాలనుకుంటుంది. కాకాపోతే మోడీ రూటే సపరేట్ అని అందరూ అనుకుంటున్న వేళ తాను కూడా డర్టీ పాలిటిక్స్‌కు ఓకే చెప్పడంతో రాజకీయాల్లో ఆ పాత రోతనే మళ్లీ మళ్లీ చూడాల్సి వస్తోంది. 
 
సంతలో పశువులు అంటూ ఎమ్మెల్యేలను పోల్చుకోవాల్సి వస్తోంది. ఎప్పుడో తీర్పు వస్తుందని దానిని చూసిన తర్వాతనే ప్రమాణ స్వీకారం చేయిస్తానని మొండికేసిన గవర్నర్ వ్యవహారం బహుశా ఇంతవరకూ చూడలేదు. అన్ని అనుకున్న ప్రకారమే జరిగి ఉంటే పన్నీరు అడ్డం తిరిగే సమయానికే శశికళ సీఎం అయి ఉండే వారు. ఇదంతా ఎందుకండీ.. అసలు సజావుగా సాగుతున్న వ్యవహారాన్ని చెడగొట్టాలనకున్న బీజీపీ ఆలోచన బాగానే ఉంది. కానీ.. రంగంలోకి దిగడంలో కాస్త ఆలస్యం అయ్యింది. 
 
ప్రస్తుతం తమిళనాడులో నడుస్తున్నవి నీచ రాజకీయాలు. అందులో ఎవరి వాటా ఎంతో తొందర్లోనే తేలిపోతుంది. కానీ తాను ఎంటరవ్వాలనుకున్నప్పుడు ముందే ఎంటర్ కావాలి. ఆలస్యం చేయడం వల్ల అభాసుపాలు కావడం తప్ప బీజేపీ సాధించేది ఏమీ లేదని అర్థం అవుతుంది. జయలలిత చనిపోయిన వెంటనే శశికళ ఏ పదవీ తీసుకోలేదు. చాలా రోజుల తర్వాత పార్టీ పదవి తీసుకుంది. అప్పుడు అయినా బీజేపీ ఎంటరవ్వాల్సింది. తర్వాత వెంటనే సీఎం పదవికి ప్రయత్నాలు చేయలేదు. అప్పుడైనా ఎంటర్ అయి ఉండాల్సింది. 
 
చివరికి ఏ గవర్నర్ చేత అయితే డ్రామా నడిపిస్తున్నారో ఆ గవర్నర్‌కు ముందే చెప్పి పన్నీరు సెల్వం రాజీనామా ఆమోదించకుండా ఉండాల్సింది. కానీ అన్నీ జరిగిపోయిన తర్వాత సీన్‌లోకి ఎంటరై అభాసుపాలుకావడం తప్ప సాధించేది ఏమీ లేదు. శాసన సభాపక్షం తమ నేతను ఎన్నుకున్న తర్వాత వెంటనే ఆమెను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉంది. ఆమె‌పై కేసులు ఉన్నాయా? వాటిలో తీర్పు ఎప్పుడు వస్తుంది అని వేచిచూసే అధికారం గవర్నర్‌కు ఉందా అన్నది అందరి ప్రశ్న. టూ లేట్ మోడీ డ్యూడ్... ట్రై నెక్స్ట్ టైం.