బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By chj
Last Modified: మంగళవారం, 25 అక్టోబరు 2016 (14:38 IST)

ప్లీజ్.... ఈ రోజైనా మీ భర్తను చాలా బాగా సంతోషంతో ముంచేయరూ... ఎందుకంటే...?

“ధర్మేచ.. అర్థేచ.. కామేచ... మోక్షేచ... నాతి చరామి” అని వివాహ సమయంలో వరుడు చేత వాగ్దానం చేయించడం హిందూ వివాహా సంప్రదాయం. మతం ఏదైనా వివాహా సమయంలో భర్తగా చేసే ప్రమాణం ఒక్కటే. సుఖదుఃఖాల్లోనూ, కష్టనష్టాల్లోనూ భార్యకు తోడుగా ఉంటానని హామీ ఇవ్వడం. ఈ నేపథ్యంల

“ధర్మేచ.. అర్థేచ.. కామేచ... మోక్షేచ... నాతి చరామి” అని వివాహ సమయంలో వరుడు చేత వాగ్దానం చేయించడం హిందూ వివాహా సంప్రదాయం. మతం ఏదైనా వివాహా సమయంలో భర్తగా చేసే ప్రమాణం ఒక్కటే. సుఖదుఃఖాల్లోనూ, కష్టనష్టాల్లోనూ భార్యకు తోడుగా ఉంటానని హామీ ఇవ్వడం. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో కొన్ని దేశాల్లో భర్త స్థానానికు ఉన్న బాధ్యతలను గుర్తు చేసే క్రమంలో 'అంతర్జాతీయ భర్తల దినోత్సవం' కూడా జరిపే రోజును అక్టోబరు 25గా నిర్ణయించారు.
 
బాధ్యతలను భరించేవాడు భర్త అని అంటారు. “భార్య అంటే ఇష్టపడి తీసుకునే బాధ్యత, పిల్లలు అంటే మోయాలనిపించే బరువు” అనేది ఒక సినిమాలోని డైలాగ్. ఈ డైలాగ్ లోనే భర్త బాధ్యత ఎలాంటిదో అర్ధమవుతుంది. సమిష్టి కుటుంబాలు అంతరించి చిన్న కుటుంబాలే ఉంటున్న ప్రస్తుత తరుణంలో భర్త యొక్క బాధ్యతలు మరెంతో పెరిగాయి. జీవితాంతం తోడు ఉండటానికి తన జీవితంలోకి ప్రవేశించిన భార్యను ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత భర్తది. 
 
భార్యభర్తల అనుబంధం బలంగా ఉన్న కుటుంబంలో పిల్లలు కూడా చక్కని గుణాలను అలవర్చుకుంటారు. ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతల విలువేంటో పిల్లలు తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు. కాలంతో పాటు పరుగులు తీస్తున్న ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో భార్యభర్తలు ప్రేమగా గంటసేపు మాట్లాడుకునే సమయం కూడా ఉండటంలేదు. భార్యభర్తలిద్దరూ ఉద్యోగులైతే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. భార్యభర్తల మధ్య అవగాహన కొరవడటంతో నేడు విడాకుల కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. 
 
కుటుంబానికి భర్త మూల స్తంభం. సంసారమనే సాగరం ఈదే నావికుడు భర్తే. కుటుంబ అభివృద్ధి, రక్షణ కోసం అనునిత్యం శ్రమించే భర్త కోసం ఒక రోజును కేటాయించి అతనిని తగిన స్థాయిలో గౌరవించడం కోసం ఈ రోజును నిర్ణయించారు. ఈ భర్తల దినోత్సవం రోజునైనా రోజంతా భర్తతో భార్య సరదగా, ఆనందంగా గడపడానికి అవకాశం కలుగుతుంది. పలు కార్పొరేట్ వ్యాపార సంస్థలు ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు గిఫ్టులను కూడా మార్కెట్లో విడుదల చేశాయి. అయినా మన పిచ్చి గానీ భర్తను గౌరవించి, ప్రేమించే భార్య కన్నా భర్తకు గొప్ప బహుమతి ఏముంది చెప్పండి.