శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Modified: శనివారం, 30 జులై 2016 (14:00 IST)

పెనం పైనుంచి పొయ్యిలో పడ్డట్లయిందంట ఆ ఎమ్మెల్యే పరిస్థితి... కుతకుతలాడుతున్నారా...?

ఈ మధ్య కాలంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి వెళ్లే నాయకుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఎపిలో అయితే ప్రతిపక్షంలో ఉన్న నాయకులందరూ అధికారపక్షంలోకి క్యూకడుతున్నారు. ఎమ్మెల్యేల నుంచి ఎంపిటిసిలు, జడ్పీటీసీలు అందరూ కూడా అధికారపక్షంలోకి దూకుతున్నారు. కారణం..

ఈమధ్య కాలంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి వెళ్లే నాయకుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఎపిలో అయితే ప్రతిపక్షంలో ఉన్న నాయకులందరూ అధికారపక్షంలోకి క్యూకడుతున్నారు. ఎమ్మెల్యేల నుంచి ఎంపిటిసిలు, జడ్పీటీసీలు అందరూ కూడా అధికారపక్షంలోకి దూకుతున్నారు. కారణం... రానున్న ఎన్నికల్లో కూడా ప్రజాభిమానంతో గెలుపొందాలని ఆశ. తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న పట్టుదల. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా పార్టీలోకి జంప్‌ అయిపోతున్నారు. 
 
ఆ పార్టీలోని వారు ఏమనుకుంటారోనన్న ఆలోచన లేదు. ఈ పార్టీ నుంచి ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనన్న భయం లేదు. అందుకే చిత్తూరు జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి తెలుగుదేశంపార్టీలోకి వెళ్లిన నాయకుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రతిరోజు ఎవరో ఒకరు అధికార పార్టీలోకి వెళ్లిపోతూనే ఉన్నారు. వీరు పార్టీ మారడం బాగానే ఉన్నా అధికార పార్టీలోని వారు మాత్రం వైకాపా నుంచి వచ్చిన నాయకులకు ఎలాంటి గౌరవం ఇవ్వటంలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి చిత్తూరు జిల్లాకు చెందిన పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అసలు అమరనాథ రెడ్డి పరిస్థితి ఏంటి.. తెలుసుకుందాం...
 
అమరనా థరెడ్డి. తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్షుడిగా, అధినేత చంద్రబాబునాయుడుకు సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఎప్పుడైనా సరే పలమనేరు సీటు ఆయనదే. అయితే విభజన జరగడం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైపు జనం ఉన్నారన్న సంకేతాలతో ఏ మాత్రం ఆలోచించకుండా వైకాపా తీర్థం పుచ్చేసుకున్నారు అమరనాథరెడ్డి. నియోజవర్గంలో తనకుంటూ ఒక ప్రత్యేకత సాధించుకున్నారు అమరనాథరెడ్డి. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూనే అందరినీ కలుపుకుని పోయే స్వభావం ఆయనది. అందుకే ఏ పార్టీలో ఉన్న ప్రజలు ఆయన్ను ఆదరించి గెలిపిస్తున్నారు. ఇదే వైకాపాలోను జరిగింది. పలమనేరు ఎమ్మెల్యేగా గెలుపొందిన అమరనాథరెడ్డి ఎక్కువ కాలం ఆ పార్టీలో ఉండలేకపోయారు.
 
కారణం వై.ఎస్‌.జగన్‌ చేష్టలే అని బహిరంగంగా అమరనాథ రెడ్డి చెప్పుకుంటుంటారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొంతమంది నాయకులను మాత్రమే జగన్‌ పలుకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడతారని, తమను మాత్రం పురుగును చూసినట్లు చూస్తుంటాడని అమరనాథరెడ్డి తన సన్నిహితులతో చెప్పుకున్నారు. దీంతో ఆ పార్టీ నుంచి నేరుగా మళ్ళీ తెదేపా వైపు దూకారు. జిల్లాలోని తెదేపా నాయకులతో పరిచయం ఉన్న అమరనాథరెడ్డి ఎలాంటి సమస్య లేకుండా నేరుగా పార్టీలో చేరిపోయారు. 
 
అమరనాథ రెడ్డి పార్టీ చేరిక బాగానే ఉన్న ఆ తరువాత ఆయనకు అసలైన చిక్కువచ్చి పడింది. ఒక్కరంటే ఒక్క కార్యకర్త, నాయకుడు కూడా అమరనాథ రెడ్డికి గౌరవం ఇవ్వటంలేదట. పార్టీ కార్యక్రమానికి హాజరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కనీస గౌరవం కూడా అమరనాథెడ్డికి ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో ఏ కార్యక్రమానికి హాజరు కాకుండానే సైలెంట్‌గా అమరనాథరెడ్డి ఉండిపోతున్నారంట. 
 
ఇదిలా ఉంటే కొంతమంది నాయకులపై కూడా అమరనాథరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అన్న కనీస గౌరవం కూడా ఇవ్వరా.. ఇలాగైతే ఎలా.. నేను ఏం చేయాలో నాకు తెలుసు అంటూ గట్టిగా కూడా బెదిరించారంట. అయితే అమరనాథరెడ్డి అరుపులకు ఒక్క నాయకుడు కూడా భయపడటంలేదంట. మొత్తంమీద అమరనాథ రెడ్డి చంద్రబాబును కలిసేందుకు సిద్థమవుతున్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నాయకులే నాకు గౌరవం ఇవ్వకుంటే మిగిలిన వారు ఏమి ఇస్తారని అమరనాథరెడ్డి తన గోడును బాబుకు విన్నవించుకోనున్నారట.