శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Updated : గురువారం, 30 జూన్ 2016 (14:03 IST)

చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బీఫ్ పెట్టి... ఆ తర్వాత రక్తపాతమే మా ప్లాన్... 'ఉగ్ర'నిజాలు

జాతీయ నిఘా వర్గాలు అత్యంత చాకచక్యంగా ఐస్ఐస్ సానుభూతిపరులను అరెస్టు చేసి హైదరాబాద్ నగరంలో పెను విధ్వంసం జరుగకుండా అడ్డుకట్ట వేసింది. ఎన్ఐఎ అరెస్టు చేసిన ఐదుగురు నిందితులు, అదుపులో ఉన్న మరో ఆరుగురు వ్యక

జాతీయ నిఘా వర్గాలు అత్యంత చాకచక్యంగా ఐస్ఐస్ సానుభూతిపరులను అరెస్టు చేసి హైదరాబాద్ నగరంలో పెను విధ్వంసం జరుగకుండా అడ్డుకట్ట వేసింది. ఎన్ఐఎ అరెస్టు చేసిన ఐదుగురు నిందితులు, అదుపులో ఉన్న మరో ఆరుగురు వ్యక్తులు చెపుతున్న వివరాలను వింటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. వారు చెప్పిన వివరాల ప్రకారం... మా ప్లాన్ తొలుత హైదరాబాద్ నగరంలో అల్లర్లు సృష్టించడమే. 
 
మత కల్లోలు సృష్టించి ఆ తర్వాత పేలుళ్లకు పూనుకోవడం. రంజాన్ పర్వదినం సందర్భంగా తొలుత చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం లోపల గోవు, గేదె మాంసాలను పెట్టాలని నిర్ణయించుకున్నాం. అది జరిగిన వెంటనే ఇక అల్లర్లు ప్రారంభమవుతాయి కనుక పోలీసులు వాటితో సతమతమవుతుంటారు. ఇదే అదనుగా పేలుళ్లకు పాల్పడాలని మేము ప్లాన్ చేశాం. బ్రస్సెల్స్‌లో ఐసిస్ ఎలాంటి పెను విధ్వంసం సృష్టించిందో అలాంటి విధ్వంసాన్ని సృష్టించాలనుకున్నామంటూ వారు చెప్పినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. 
 
కాగా గురువారం నాడు తమ అదుపులోకి తీసుకున్న ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ గ్రూపు వ్యక్తుల వద్ద ఎన్ఐఎ విచారణ జరుపనుంది. మొగల్ పురాకు చెందిన సయ్యద్ నైమత్ ఉల్లా హుస్సేన్(42), తలాబ్ కట్టాకు చెందిన ముజఫర్ హుస్సేన్(29), బండ్లగూడకు చెందిన మహ్మద్ అతౌల్లా(30), గుల్షన్ కాలనీకి చెందిన అబ్దుల్(32), తలాబ్ కట్టకు చెందిన అజహర్(20), చాంద్రాయణగుట్టకు చెందిన అర్బాజ్ అహ్మద్(21)లను విచారించి వదిలేశారు.
 
కాగా పట్టుబడిన వారి వద్ద నుంచి శక్తివంతమైన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాలతో కనీసం 500 మందిని చంపవచ్చని నిఘా వర్గాలు చెపుతున్నాయి. ముఖ్యంగా జనసమ్మర్ధం అధికంగా ఉండే మాల్స్, ఐటీ కంపెనీలు, వీవీఐపీలపై విచక్షణారహితంగా దాడులు చేయడంతో ద్వారా హైదరాబాద్ నగరాన్ని అల్లకల్లోలం చేయడమే వారి లక్ష్యమని ఎన్ఐఎ వెల్లడిస్తోంది. ఈ కాల్పులు సమయంలో తమకు ఎదురుదాడి వస్తే... ఆత్మాహుతి చేసుకుని భారీ విధ్వంసానికి కుట్ర చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని చెపుతున్నారు.