గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2016 (16:28 IST)

పార్టీకి ఫండ్స్ ఇవ్వలేదనేనా.. చిత్తూరు ఎమ్మెల్యేపై ఐటీ వేధింపులు?

తెలుగుదేశం పార్టీకి ఫండ్‌ ఇవ్వకపోవడం వల్లనే చిత్తూరు ఎమ్మెల్యేకి వేధింపులు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. గత కొన్నిసంవత్సరాలుగా టిడిపికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా చిత్తూరు ఎమ్మెల్యే డబ్బులు ఇస్తేనే ఆ క

తెలుగుదేశం పార్టీకి ఫండ్‌ ఇవ్వకపోవడం వల్లనే చిత్తూరు ఎమ్మెల్యేకి వేధింపులు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. గత కొన్నిసంవత్సరాలుగా టిడిపికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా చిత్తూరు ఎమ్మెల్యే డబ్బులు ఇస్తేనే ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఎందుకంటే చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ మాజీ నేత, దివంతగ ఎంపి ఆదికేశవులనాయుడు భార్య. ఆదికేశవుల నాయుడుకు గురించి పెద్దగా చెప్పనక్కరలేదు. కింగ్‌ఫిషర్‌తో పాటు మరికొన్ని సంస్థలలో వేలకోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన వ్యక్తి ఆయన. ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఆయన కూడా ఒకరు.
 
అందుకే అప్పట్లో ఆదికేశవుల నాయుడును తెలుగుదేశంపార్టీ గౌరవించి అనుకున్న సీటును ఇచ్చింది. ఊరికే కాదండోయ్‌.. అంతా పార్టీకి ఇచ్చే ఫండ్‌.. పార్టీ నిర్వహించే కార్యక్రమాలు మొత్తం ఆదికేశవులనాయుడు ఇచ్చే డబ్బుల మీదే నడుస్తుందేదట గతంలో. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే అనారోగ్యంతో ఆదికేశవులనాయుడు చనిపోవడంతో ఆయన భార్య ఎమ్మెల్యే అయ్యారు. అయితే భర్త ఇచ్చినట్లుగా పార్టీకి మాత్రం పెద్దగా ఫండ్‌ ఇవ్వలేదామె. డి.కె.కుటుంబానికి సంబంధించిన మొత్తం వ్యవహారాలను కుమారుడు డి.కె.శ్రీనివాసులు చూస్తున్నారు. బెంగుళూరు, పాండిచ్చేరి, ఏపీ ఇలా ఎన్నో ప్రాంతాల్లో పరిశ్రమలు వీరికి ఉన్నాయి. నెలకు కోట్ల రూపాయల్లో టర్నోవర్‌. మొత్తం బాధ్యతలు ఇప్పుడు డి.కె.శ్రీనివాసులది.
 
అయితే గత కొన్నినెలల నుంచి టిడిపి పార్టీ ఫండ్‌ అడిగినా ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఇదంతా చూస్తున్న స్థానిక నేతలు ఏకంగా అధినేత దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది. దీంతో బాబు సీరియస్‌ అయ్యారని సమాచారం. ఇక అధినేత సీరియస్‌ అయితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకదా.. ఏకంగా దాడులే. అది కూడా ఐటీ దాడులు. కోట్ల రూపాయల విలువచేసే ఫైళ్ళను ఐటీ అధికారులు రెండురోజుల పాటు పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈనెల 30వ తేదీ వరకు డి.కె. కుటుంబానికి సమయమిచ్చారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. 30 సంవత్సరాల లెక్కను మూడు రోజుల్లో చూపించమంటే ఏ విధంగా చూపిస్తామంటున్నారు డి.కె.కుటుంబం. మొత్తం మీద ఇదంతా పార్టీ అధినేతే చేస్తున్నారని అర్థమైంది డి.కె.కుటుంబానికి మరో రెండురోజుల్లో అధినేతను కలిసి ప్రాధేయపడడానికి సత్యప్రభ, డి.కె. శ్రీనివాసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.