Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జగన్ పాదయాత్ర అలా సక్సెస్ అవుతుందా...?

మంగళవారం, 24 అక్టోబరు 2017 (19:46 IST)

Widgets Magazine
jagan - ramoji rao

వచ్చే ఎన్నికల అనంతరం జగన్ మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి అంటున్నారు వైసీపీ నాయకులు. అందుకోసం ఇప్పటి నుంచే గట్టి కసరత్తు మొదలుపెట్టారు. తండ్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గతంలో చేపట్టిన పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్ళి తిరుగులేని నాయకుడిగా పేరు సాధించడం తెలిసిందే. ఈ నేపధ్యంలో జగన్ మోహన్ రెడ్డి కూడా చివరకు పాదయాత్రపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. కానీ ఇప్పుడు ఆ పాదయాత్రకు కోర్టు తీర్పు కాస్త అడ్డంకిగా తగులుతోంది. పాదయాత్ర చేస్తున్నా వెసులుబాటు కల్పించాలంటూ సిబిఐ కోర్టులో వేసిన పిటిషన్‌ను కొట్టి వేయడంతో ఇబ్బందిగా మారింది. ఐతే పైకోర్టుకు వెళ్లేందుకు జగన్ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 
 
పాదయాత్ర మొదలుపెట్టే ముందుగానే ఆయన తనకు శత్రువులుగా ఉన్న వారందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావును బాగా దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రామోజీరావు కోడలు, జగన్ సతీమణి ఇద్దరూ మంచి స్నేహితురాళ్ళయిపోయారు. దీంతో వీరి మధ్య పెద్దగా గొడవలు ఉండవని అందరూ భావించారు. ఆ తరువాత రామోజీకి దగ్గరయ్యారు జగన్. 
 
ఇలా జగన్ పాదయాత్రకు పత్రికల వైపు నుంచి కూడా మెల్లగా మద్దతు కూడగట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద నవంబర్ నెల నుంచి ప్రారంభం కానున్న పాదయాత్రను విజయవంతంగా పూర్తిచేసి వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న కృతనిశ్చయంతో జగన్ మోహన్ రెడ్డి వున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కాంగ్రెస్ దొంగే... బీజేపీ అంతకుమించిన గజదొంగ : హార్దిక్ పటేల్

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల తేదీలను వెల్లడించాల్సి ...

news

తిరుపతిలో చిరుత కలకలం.. కుక్కను చంపి...

తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతంలో ఒక చిరుతపులి బోనులో చిక్కింది. కపిలతీర్థం సమీపంలో ఏర్పాటు ...

news

రాజధాని అంటే సినిమా సెట్టింగ్ కాదు.. : ఐవైఆర్ కృష్ణారావు ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఎండీ ...

news

ఆంధ్రప్రదేశ్‌కు విజయా బ్యాంకు 2 వేల కోట్ల ఋణం మంజూరు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజయా బ్యాంకు 2 వేల కోట్ల రూపాయల ఋణం మంజూరు చేసింది. ఈ ...

Widgets Magazine