శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: సోమవారం, 18 ఏప్రియల్ 2016 (14:33 IST)

తెదేపాలోకి వెళ్లే వైసీపీ ఎమ్మెల్యేలు ఆ వ్యామోహంతో పోతున్నారట...

జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ నుంచి వలసలు ఎంత ఆపుదామన్నా ఆగేట్లు కనబడటం లేదు. దీనితో ఆ పార్టీలో సహజనంగానే ఆందోళన కనబడుతోంది. ఏ ఎమ్మెల్యే ఎప్పుడు ఝలక్ ఇస్తారో అర్థం కావడంలేదు. దీనితో జగన్ మోహన్ రెడ్డి సీనియర్ నాయకులను రంగంలోకి దింపి వలసలకు అడ్డుకట్ట

జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ నుంచి వలసలు ఎంత ఆపుదామన్నా ఆగేట్లు కనబడటం లేదు. దీనితో ఆ పార్టీలో సహజనంగానే ఆందోళన కనబడుతోంది. ఏ ఎమ్మెల్యే ఎప్పుడు ఝలక్ ఇస్తారో అర్థం కావడంలేదు. దీనితో జగన్ మోహన్ రెడ్డి సీనియర్ నాయకులను రంగంలోకి దింపి వలసలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే దీనిపై కొందరు పలు రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. 
 
ఇదిలావుంటే ఊహించని విధంగా తెదేపాలోకి జంప్ అవుతున్న ఎమ్మెల్యేల విషయంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఏంటనే విషయం ఆ పార్టీలో ఉన్న నాయకులకు అర్థం కావడంలేదట. జగన్ అడుగులు ఏమిటో ఒకపక్క అర్థం కాకుండా ఉంటే మరోవైపు ఒక జిల్లా తర్వాత మరో జిల్లా అన్నట్లుగా జగన్ మోహన్ రెడ్డి పార్టీకి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకోవటానికి క్యూ కడుతున్నారు. 
 
కాగా జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వైవి సుబ్బారెడ్డి తాజాగా అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ మాట అన్నారు. కొందరు ఎమ్మెల్యేలు డబ్బు వ్యామోహంతో, పదవుల వ్యామోహంతో వెళ్లిపోతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఐతే ఎమ్మెల్యేలు వెళ్లినప్పటికీ కార్యకర్తలంతా పార్టీతోనే ఉన్నట్లు ఆయన జోస్యం చెపుతున్నారు. 
 
ఐతే ఇక్కడ మరో మాట వినబడుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ మోహన్ రెడ్డి బయటకు వచ్చినపుడు వైఎస్సార్ అనుచరగణం అంతా జగన్ మోహన్ రెడ్డి వెంట నడవలేదా.. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేల వెంట క్యాడర్ కూడా వెళుతోందని కొందరు వాదిస్తున్నారు. మొత్తానికి ఏదైతేనేం... వలసల దెబ్బకు వైసీపి షాక్ తింటోంది.