Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. పవన్‌తో పొత్తుకు జగన్ ప్లాన్.. మహాకూటమి ఏర్పాటవుతుందా?

బుధవారం, 7 జూన్ 2017 (12:48 IST)

Widgets Magazine
Pawan _ Jagan

2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని.. అందుకోసం అందుబాటులో ఉండే ఏ అవకాశాన్నైనా సద్వినియోగం చేసుకునేందుకు వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి రెడీ అయిపోయారు. ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి పవన్ స్టార్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌‍తో చేతులు కలిపేందుకు  సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోకి వెళ్ళాలని భావిస్తున్న జగన్.. పవన్‌తో చర్చలకు కూడా రంగం సిద్ధం చేశారు. జనసేనానితో చర్చలు జరిగే బాధ్యతలను జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ కాపు నేతకు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది. 
 
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్ ఇచ్చిన నివేదికలోని అంశాలపై తన నేతలతో చర్చించిన జగన్.. 2019లో ఎన్నికల్లో గెలవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే పవన్‌తో కలిసి నడించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వామపక్ష పార్టీలు ప్రకటించిన తరుణంలో పవన్‌తో జత కడితే సీపీఐ, సీపీఎంలు కూడా కలిసి వచ్చినట్టేనని ప్లాన్ వేస్తున్నారు. 
 
ఇక ఒంటరిగా వున్న కాంగ్రెస్‌ను కలుపుకుని మహా కూటమిని ఏర్పాటు చేసి.. తద్వారా తెలుగుదేశం పార్టీని 2019 ఎన్నికల్లో ఓడించాలని జగన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి జగన్ ఆలోచనకు పవన్ మద్దతిస్తారా.. వైకాపాతో జనసేన పొత్తుపెట్టుకుంటుందా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రేమిస్తే చావాల్సిందే... దుడ్డుకర్రతో కూతురు తలపై కొట్టి చంపిన తల్లి...

ప్రేమంటే ఎందుకో పెద్దలు ఓ పట్టాన అంగీకరించరు. చాలా ప్రేమ వ్యవహారాలు ట్రాజెడీలుగానే ...

news

జూలై 3న రజినీ రాజకీయ ప్రవేశం... అల్లుడు ధనుష్‌కి ఎందుకు అంత ఆత్రం?

దక్షిణాది రాష్ట్రాల సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం దాదాపు ఖరారైంది. ఇప్పటివరకు ...

news

బరితెగించిన పాక్.. చైనాకు గిల్గిత్ భూముల్ని అమ్మేస్తుంది.. చైనా తక్కువేం తినలేదు..

చైనాలోని పలు కంపెనీలకు, చైనా ఆర్మీకి భూములను తెగ అమ్మేస్తున్నారంటూ గిల్గిత్-బాల్టిస్థాన్ ...

news

ల్యాప్‌టాప్‌లో సూసైడ్ నోట్.. బతకాలని లేదు.. తమ్ముడూ వారిని బాగా చూసుకో?

ఓ యువకుడికి బతకాలనించలేదు. అందుకే అమ్మానాన్నలను బాగా చూసుకో తమ్ముడూ అంటూ ల్యాప్‌టాప్‌లో ...

Widgets Magazine